బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలోని 5 గురు కుటుంబ సభ్యులు దారుణమైన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసారు. నవంబర్ 16 ఉదయం బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో జాతీయ రహదారి నవంబర్ 333లో ట్రక్కును ఢీ కొనడంతో సుశాంత్ కుటుంబ సభ్యులు మరణించారు. 10 మందితో ప్రయాణిస్తున్న వాహనంలో ఆరుగురు అక్కడకిక్కడే మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హర్యానా సీనియర్ పోలీసు అధికారి OP సింగ్ సోదరి గీతా దేవి అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు పాట్నా నుంచి తిరిగి వస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌కు OP సింగ్ స్వయానా బావ. సుశాంత్ మరణించిన సమయంలో ఈయన పేరు ఎక్కువగా వినిపించింది. 2020 జూన్ 14న ముంబైలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా మరణించాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.
అప్పటి నుంచి అభిమానులు ఆయన్ని మిస్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన కుటుంబంలోని మరో ఐదుగురు సభ్యులు రోడ్డు ప్రమాదంలో మరణించడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. హల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రా సమీపంలో మిడిల్ స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీన్ని లఖిసరాయ్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుశీల్ కుమార్ ధృవీకరించారు.