ఓవైపు గుళ్లు మాత్రమే కాదు మరోవైపు పార్టీలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఈ జోడీ. ఎప్పటికప్పుడు వీళ్ల పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి కానీ ఆ ముచ్చట మాత్రం జరగదు. మూడు ముళ్ల కోసం బాగానే వేచి చూస్తుంది నయన్. ఇన్ని రోజులు అయితే లేట్ అయింది కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే త్వరగానే ఈ మూడు ముళ్ళ ముచ్చట పూర్తయ్యేలా కనిపిస్తుంది.
కానీ ఈమె జాతకంలో పెళ్లి యోగం లేదని కొందరు జ్యోతిష్కులు కుండ బద్ధలు కొట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే పెళ్లి కాకుండా సహజీవనం దగ్గరే నయన్ ఆగిపోయిందనే వాళ్లు కూడా లేకపోలేదు. ఏదేమైనా కూడా విఘ్నేష్‌తో మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటుంది ఈ కేరళ కుట్టి. ఇప్పుడు ఆ కలిసుండే బంధాన్ని జీవితాంతం ఉండేలా పెళ్లికి సిద్ధమవుతుంది.