KTR - Prabhas - Adipurush : ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాపై తెలంగాణ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలతో మంచి సఖ్యతతో ఉంటోంది. అంతేకాదు కేటీఆర్ కూడా తెలంగాణలో జరిగే పలు సినీ ఫంక్షన్లకు ముఖ్య అతిథిగా హాజరై సినీ ఇండస్ట్రీకి అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇపుడు తెలంగాణ, సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. (Twitter/Photo)
ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సహా పలు సినిమాలను బీజేపీ (భారతీయ జనతా పార్టీ) తన అజెండాలో భాగంగా తెరకెక్కించిన మూవీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్.. ప్రభు శ్రీరాముడి పాత్రలో నటించారు. (Twitter/Photo)
తెలుగులో ఇప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు, హరనాథ్, శోభాన్ బాబు, బాలకృష్ణ, సుమన్, ఎన్టీఆర్, శ్రీకాంత్ వంటి హీరోలు శ్రీరాముడి పాత్రల్లో అలరించారు. హిందీలో జితేంద్ర వంటి ఒకరిద్దరు హీరోలు మాత్రమే శ్రీరాముని పాత్రలో అలరించారు. ఇక హిందీలో రామాయణ గాథపై వచ్చిన ‘రామాయణం’ సీరియల్ ఎంతో పాపులర్ అయింది. కానీ సినిమాలేవి తెరకెక్కలేదు. ఇపుడు పూర్తి స్థాయిలో ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఓంరౌత్ తెరకెక్కించారు. ప్రభాస్ తొలిసారి పౌరాణిక పాత్రలో నటించారు. ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)
అందులో భాగంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా కూడా వచ్చిందన్నారు. అందులో దేశభక్తి, బీజేపీ సిద్ధాంతాలు ఉండేలా తెరకెక్కిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు టాక్స్ ఫ్రీ ప్రకటిస్తారన్నారు. అలాగే ప్రేక్షకులు చూసేలా సినిమాపై ప్రచారం నిర్వహిస్తారన్నారు. ఎన్నికల ముందు ఆయా చిత్రాలను విడుదల చేయడం.. బీజేపీ ఎలక్షన్ ప్లానింగ్ అంటున్నారు. ఇవన్నీ పొిలిటికల్ ఎజెండాలో భాగంగానే తెరకెక్కించినట్టు చెప్పారు. (Twitter/Photo)
ఇక ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రంతో మరోసారి శ్రీరాముడి సెంటిమెంట్‌ను తీసుకొస్తారన్నారు. రామ రాజ్యం అంటే బీజేపీ ప్రభుత్వం అని ప్రజలు భావించేలా చేయడమే ఈ చిత్రాల లక్ష్యమన్నారు. దేశ భక్తి అంటే బీజేపీ అనే భావన కలిగేలా ఈ చిత్రాలు రూపొందించడం జరిగిందన్నారు. అయితే... కేటీఆర్ వ్యాఖ్యలు చూసి నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. దేశభక్తితో పాటు మన ఇతిహాసాలను సినిమాలుగా తీస్తే తప్పేముంది.. అందులో క్వశ్చన్ చేయాల్సిన అవసరమేమిటి అంటున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటమిలనేవి ప్రజలు నిర్ణయిస్తారు. సినిమాలు తీసినంత మాత్రానా ప్రజలు ఓటేస్తారా అని కేటీఆర్ తీరును ఎండగడుతున్నారు.
బీజేపీ ఎన్నికల ఎజెండా ప్రభాస్‌కు తెలిసి ఉండొచ్చు అయినా.. ఏమి చేయలేకపోతన్నారంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ కోవలో నే ఇప్పటికే తాష్కెంట్ ఫైల్స్, పాడ్ మ్యాన్, గోల్డ్, సత్యమేవ జయతే, భాగి 2, మేరే ప్యారే ప్రధాన్ మంత్రి, మణికర్ణిక లాంటి చిత్రాలు బీజేపీ అజెండాలో భాగంగా తెరకెక్కినవే అంటూ కేటీఆర్ అన్నారు. మరి ఈ ఆరోపణలపై ప్రభాస్ ఎలా స్పందిస్తాడనేది చూడాలి. (Twitter/Photo)