Ram Charan: నీ గురించి వింటున్నా... రామ్ చరణ్ పై కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
Ram Charan: నీ గురించి వింటున్నా... రామ్ చరణ్ పై కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 25న రిలీజైన ఈ పాన్ ఇండియా మూవీ రూ.100 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ దాని క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఈ సినిమాపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్.. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఫస్ట్ సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇటీవలే నటించిన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాతో చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.
2/ 7
అయితే మంత్రి పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు విషెష్ చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ కూడా కేటీఆర్‌కు విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు.
3/ 7
హ్యాపీ బర్త్ డే టు మై డియరిస్ట్ బ్రదర్.. హార్డ్ వర్కింగ్ లీడర్ అంటూ... రామ్ చరణ్ ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ... 'థ్యాంక్యూ బ్రదర్. ఆర్ఆర్ఆర్ సినిమాలో నీ నటన గురించి గొప్పగా చెప్తుంటే వింటున్నా. త్వరలో నీ సినిమా తప్పకుండా చూస్తా'నని బదులిచ్చాడు.
4/ 7
ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే కేటీఆర్‌కు కాలికి గాయం అయిన విషయం తెలిసిందే. దీంతో డాక్టర్లు ఆయనకు మూడు వారాల పాటు రెస్ట్ అవసరమని చెప్పారు.
5/ 7
కేటీఆర్ కాలికి గాయం అయిన విషయాన్ని కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సమయంలో విలువైన ఓటీటీ షోలు చూడటానికి సలహా ఇస్తారా? అంటూ కేటీఆర్ తన ట్వీట్లో పేర్కోవడం విశేషం. అయితే కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌కు చాలా మంది రెస్పాన్స్ అయ్యారు.
6/ 7
అయితే ఈ ఫ్రీ టైంలో కేటీఆర్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా చూస్తారని .. ఆయన రామ్ చరణ్ పై చేసిన కామెంట్ల ద్వారా తెలుస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా టాలీవుడ్లో ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమాకు హాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి.
7/ 7
మరోవైపు కేటీఆర్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు.. రామ్ చరణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు రేసులో కూడా నిలిచింది. ఈసారి మనకు ఆస్కార్ అవార్డు కచ్చితంగా వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.