అంతేకాదు కరణ్ జోహార్ ఆత్మహత్య చేసుకుంటున్నాడని తెలుసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త అతనికి 300 కోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడని కమల్ చెప్పడం గమనార్హం. ఇకనైనా దివాళా తీశానని ప్రకటించాలంటూ కరణ్ జోహార్ పై కమల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే విషయాన్ని సినీ క్రిటిక్ ఉమైర్ సందు కూడా చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది.
గతంలో కూడా బ్రహ్మాస్త్ర సినిమాపై ఇలాగే కాంట్రోవర్సియల్ కామెంట్స్ చేశారు కమల్. బ్రహ్మాస్త్ర సినిమా కలెక్షన్స్ అన్ని ఫేక్ అని కావాలని హైప్ చేసే విధంగా కలెక్షన్స్ ప్రకటిస్తున్నారని ఆ సమయంలో కమల్ ఆర్ ఖాన్ పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాకి రివ్యూ కూడా ఇవ్వకుండానే అసలు ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తారనే నమ్మకం లేదని కూడా అన్నారు.