కృతి సనన్ విషయానికొస్తే.. ఈమె టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘నేనొక్కడినే’ సినిమాతో పరిచమైంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ తీసి జ్జాపకం అనే చెప్పాలి. హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘హీరో పంతి’ సినిమాతో పరిచయమైంది. (Instagram/Photo)
ప్రస్తుతం కృతి సనన్ .. హీరోగా ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’లో సీతమ్మ పాత్రలో నటిస్తోంది. అంతా బాగుంటే ఈ పాటికి ఈ సినిమా విడుదలై ఉండేది. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ పై విమర్శలు రావడంతో గ్రాఫిక్స్ పనుల కోసం ఈ సినిమాను మరో ఆరు నెలలు వాయిదా వేసారు. ఈ చిత్రాన్ని ఈ ఇయర్ జూన్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Instagram/Photo)
గత యేడాది అక్షయ్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ అక్షయ్ పాండే సినిమాలో నటించింది. ఆత తర్వాత ‘బేడియా’ సినిమాల్లో నటించింది. వీటి ఫలితాలు తేడా కొట్టాయి. అటు ‘హీరో పంతి 2’లో ఐటెం సాంగ్‌లో మెరిసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈమె ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఇక ఆదిపురుష్‌లో సీత పాత్రపై ఈమెకు నటిగా మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉంది. (Instagram/Photo)
అటు ‘మిమీ’ చిత్రంలో సరోగేట్ మదర్‌గా నటించడానికి 15 కిలోలు బరువు పెరిగింది. మళ్లీ ఆ బరువు తగ్గేందుకు చాలా కష్టపడింది. అటు ఈమె నటించిన ‘షెహజాదా’ సినిమా 10 ఫిబ్రవరిన విడుదల కానుంది. ఈ మూవీ తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. అటు ఆదిపురుష్, గణపత్ సినిమాలతో పలకరించనుంది(Photo Credit : Instagram)
కృతి సనన్ .. 1990 జూలై 27న న్యూ ఢిల్లీలో జన్మించింది. JP ఇన్ఫర్మషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. అటు పలు ఉత్పత్తులకు మోడల్‌గా పనిచేసి చివరగా హీరోయిన్గా ఎంపికైంది.ఈమె తండ్రి రాహుల్ సనన్.. చార్టెడ్ అకౌంటెంట్, తల్లి గీతా సనన్ ఫిజిక్స్ ఫ్రొఫెసర్, ఇక ఈమె చెల్లెలు నుపుర్ సనన్ త్వరలో రవితేజ హీరోగా నటిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. (Instagram/Photo)