Kriti Sanon : కృతిసనన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్. ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజాగా ఈ చిన్నది త్వరలో కోలీవుడ్‌లో ఓ స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. (Instagram/Photo)
కృతి సనన్ విషయానికొస్తే.. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘నేనొక్కడినే’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ తీసి జ్జాపకం అనే చెప్పాలి. (Twitter/Photo)
ఆదిపురుష్ చిత్రంతో పాటు అక్షయ్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బచ్చన్ పాండే’తో పలకరించింది. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఈ సినిమాను దారుణంగా దెబ్బ తీసిందనే చెప్పాలి. మరోవైపు హిందీలో కృతి సనన్.. ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాల్లో నటించింది. హౌజ్ ఫుల్ 5 సీజన్‌తో పాటు గణపత్ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. (Instagram/Photo)
అటు ‘మిమీ’ చిత్రంలో సరోగేట్ మదర్‌గా నటించడానికి 15 కిలోలు బరువు పెరిగింది. మళ్లీ ఆ బరువు తగ్గేందుకు చాలా కష్టపడింది.దక్షిణాదికి చెందిన తెలుగు సినిమాతో పరిచయమైన కృతి సనన్.. తొలిసారి తమిళ సినిమాలో నటించనుంది. విజయ్ హీరోగా నటిస్తోన్న 66వ చిత్రంలో ఈమె హీరోయిన్గా నటించబోతున్నట్టు సమాచారం. బీస్ట్ సినిమా తర్వాత విజయ్ ఈ సినిమాలో నటించనున్నారు. త్వరలో విజయ్ సరసన కృతి సనన్ నటించబోయే విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. (File/Photo)