Kriti Sanon : కృతిసనన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్. ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజాగా ఈమె డ్రెసింగ్ పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవా అంటూ కృతి సనన్ ఎండగడుతున్నారు. (Instagram/Photo)
కృతి సనన్ విషయానికొస్తే.. ఈమె టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘నేనొక్కడినే’ సినిమాతో పరిచమైంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ తీసి జ్జాపకం అనే చెప్పాలి. (Instagram/Photo)
ప్రస్తుతం కృతి సనన్ .. ప్రభాస్ హీరోగా ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’లో సీతమ్మ పాత్రలో నటిస్తోంది.ఈ సినిమా ను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ పై విమర్శలు రావడంతో గ్రాఫిక్స్ పనుల కోసం ఈ సినిమాను మరో ఆరు నెలలు వాయిదా వేసారు. ఈ చిత్రాన్ని వచ్చే 2023 జూన్ 16న విడుదల చేస్తున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. (Instagram/Photo)