బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్. ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. (Instagram/Photo)
మహేష్ బాబు ‘నేనొక్కడినే’ తర్వాత నాగ చైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ఈ అమ్మడికి తెలుగులో సక్సెస్ అందించలేకపోయాయి. ఇపుడు చాలా యేళ్ల తర్వాత తెలుగులో తన లక్ పరీక్షించుకోబోతుంది. తాజాగా కృతి సనన్ ప్రభాస్‌తో కలిసి ఆదిపురుష్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. (Instagram/Photo)
అయితే వీరిద్దరిపై గత కొన్నిరోజులుగా కొన్ని గాసిప్స్ వస్తున్నాయి.ప్రభాస్‌తో డేటింగ్లో ఉందనే వార్త హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.భాస్ ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్‌ను ప్రేమిస్తున్నాడని.. అంతేకాదు ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు లేటెస్ట్ టాక్ వినపడుతోంది. ఈ వార్త ఇక్కడ టాలీవుడ్లో కంటే బాలీవుడ్లో తెగ హల్ చల్ చేసింది. Prabhas and Kriti Twitter
ఈ వార్తలపై అఫీషియల్ ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా స్పందించారు నటి కృతి సనన్. ఆమె తన పోస్ట్‌లో పేర్కోంటూ.. అటువంటిది ఏమి లేదని.. బేస్ లెస్ రూమర్స్‌ను నమ్మవద్దని, తన పెళ్లి నిశ్చయం అయిందని వస్తున్న వార్తలు కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని స్పష్టం చేశారు. అయితే తాజాగా మరోసారి కృతి ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మా ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందనే గాసిప్స్ వచ్చాయని చెప్పుకొచ్చింది కృతి సనన్. వాటిలో ఏ మాత్రం నిజం లేదని చెప్పింది. ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి. అందరితో స్నేహంగా ఉంటారు' అని చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి కృతి ప్రభాస్‌ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు సీతారాముడుగా ఆదిపురుష్ సినిమాలో కలిసి నటిస్తోన్న విషయం తెలిసిందే.