ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ సినిమా చేస్తున్న కృతి సనన్.. ప్రస్తుతం భేడియా (తెలుగులో తోడేలు)తో హిట్ కొట్టేసింది. దీంతో వరుణ్ ధావన్, కృతిల ఖాతాలో హిట్ పడింది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పదే పదే ప్రభాస్ పేరు ప్రస్థావనలోకి రావడం విశేషం. ఓ మీడియా ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ తో పెళ్లి అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చింది కృతి.
ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమా చేస్తోంది కృతిసనన్. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్స్, ఇతర పనుల్లో ప్రభాస్ తో ఫుల్ క్లోజ్ అయింది కృతి. ఈ ఇద్దరూ కూడా ఎంతో సరదాగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఆదిపురుష్ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభాస్ తో పెళ్లిపై కృతి ఓపెన్ కావడం హాట్ టాపిక్ అయింది.
ఇప్పటికే ఈ ఆదిపురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు మేకర్స్. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆదిపురుష్ రూపంలో వస్తున్న ఈ రామ రావణ యుద్ధం ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయం అని ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ కన్ఫర్మ్ చేశాయి.
భారీ తారాగణం ఎంచుకున్న దర్శకనిర్మాతలు.. సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ లను ఈ సినిమాలో భాగం చేశారు. దీంతో ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు రెబల్ స్టార్ అభిమానులు. అయితే ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అయ్యేలా ఈ మూవీ ఉంటుందని చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమాను 3D ఫార్మాట్ లో కూడా విడుదల చేయనుండటం విశేషం.