Krithi Shetty | కృతి శెట్టి.. ప్రస్తుతం తెలుగులో హాట్ బ్యూటీగా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఉప్పెనతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. వరుసగా మూడు హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ నమోదు చేసిన ఈ భామ.. ‘ది వారియర్’ మూవీతో తొలి ఫ్లాప్‌ను అందుకుంది. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీతో మరో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకుంది. అటు సుధీర్ బాబు హీరోగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ సినిమాతో హాట్రిక్ ఫ్లాప్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. (Instagram/Krithi)
కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా.. ? అంటే ప్రస్తుతం ఈమె ట్రాక్ చూస్తే ఔననే చెప్పాలి. ఈమె నటించిన రెండు సినిమాలు ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’ నెల రోజుల గ్యాప్‌లో విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. మొత్తంగా హాట్రిక్ లక్కీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న బేబమ్మకు వరుస ఫ్లాపులు బేజారు తెప్పిస్తున్నాయి. (Instagram/Krithi)
ప్రస్తుతం ఈ భామ నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బై లింగ్వల్ మూవీ ‘కస్టడీలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమాపై బేబమ్మ భారీ ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా ఫట్ అయితే.. కృతి శెట్టికి గడ్డు పరిస్థితులే అని చెప్పాలి. (Instagram/KrithiShetty)
సినీ ఇండస్ట్రీలో ఒక్కో సీజన్లో ఒక్కో హీరోయిన్ హవా నడుస్తూ ఉంటోంది. అలా టాలీవుడ్లో పూజా హెగ్డే, రష్మిక, రాశి ఖన్నాల తర్వాత టాలీవుడ్ టాప్ కథానాయిక లీగ్‌లో కృతి శెట్టి కూడా చేరింది.కానీ ఇపుడు వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి సినిమాలు ఈమె ఆశలపై నీళ్లు చల్లాయి. (Instagram/Krithi shetty)
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి కప్పుడు పాత నీరు పోయి.. కొత్త నీరు వస్తూ ఉంటోంది. ఈ కోవలో యువ హీరోయిన్లు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కన్నడ భామ కృతి శెట్టి ఒకరు. తాజాగా బేబమ్మకు తమిళంతో పాటు హిందీలో గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. (Instagram/Photo)
కృతి శెట్టి.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేస్తోంది. ఉప్పెనతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. ఆ తర్వాాత నాని ‘శ్యామ్ సింగరాయ్’లో మెరిసింది. లాస్ట్ ఇయర్ నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’లో నాగలక్ష్మిగా వయ్యారాలుపోయింది. ఈ సినిమా సక్సెస్‌తో వరుసగా మూడు హిట్స్‌తో సూపర్ క్రేజ్ సంపాదించుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. (Instagram/Photo)
ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్ పరిచయమైనా.. స్ఠార్ రేంజ్ అనేది కొంది మంది మాత్రమే దక్కుతోంది. అందులో కృతి శెట్టి ముందు వరుసలో ఉంటోంది. ఇండస్ట్రీలో హీరోలకు స్టార్ ఇమేజ్ రావడానికి చాలా కాలం పడుతుంది కానీ హీరోయిన్లకు మాత్రం కాదు వరుసగా రెండు హిట్లు ఇచ్చారంటే చాలు వాళ్లు స్టార్ హీరోయిన్ అయిపోతారు ఇప్పుడు కృతి శెట్టి విషయంలో ఇదే జరిగింది. తాజాగా ‘ది వారియర్’, మాచర్ల నియోజకవర్గం’తో పాటు ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ సినిమాల ఫ్లాపులతో వరుస ఫ్లాపులతో హాట్రిక్ ఫ్లాప్స్‌ను మూటగట్టుకుంది. ఇక ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ సినిమాలో తొలిసారి డ్యూయల్ రోల్లో నటించింది. (Instagram/Photo)
ఈ ముద్దుగుమ్మ సాయి ధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించింది బేబమ్మ. ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకునే వరకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలతో బిజీగా ఉంది. (Instagram/Photo)
దానికి తోడు వరుస విజయాలు కూడా ఈమె రేంజ్ పెంచేస్తున్నాయి. ఉప్పెన తర్వాత విడుదలైన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు కూడా విజయం సాధించాయి. నాని సినిమాలో బెడ్రూమ్ సీన్స్ కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. అలాగే నాగ చైతన్య జోడీగా బంగార్రాజులో అల్లరి పాత్రతో ఆకట్టుకుంది. దాంతో మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న హీరోయిన్గా రికార్డ్ క్రియేట్ చేసింది కృతి శెట్టి. Instagram/Photo)
కానీ ఈమె పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే. వీళ్ల నాన్న ప్రముఖ బిజినెస్ మ్యాన్. తల్లి ఫ్యాషన్ డిజైనర్‌గా పలు సినిమాలకు పని చేసారు. అంతేకాదు సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు డిమాండ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలని చూస్తారు చాలా మంది నటీనటులు. ఆ ఫార్ములాను ఫాలో అవుతూ వరుస అవకాశాలను ఒడిసిపడుతోంది. (Krithi shetty Photo : Instagram)
దీంతో పాటు కృతి శెట్టి.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌తో పాటు యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో ఈ భామకు అవకాశం దక్కినట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం వెలుబడాల్సి ఉంది. అంతేకాదు ఇపుడు హిందీలో భారీ ప్రాజెక్ట్‌లో ఈ భామకు హీరోయిన్ ఆఫర్ వచ్చిందట. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఏకంగా రూ. కోటిన్నర డిమాండ్ చేసినట్టు సమాచారం. షాహిద్ కపూర్ హీరోగా ఈమె హిందీలో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. (Instagram/Photo)