Krithi Shetty: కృతిశెట్టి, ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ కృతిశెట్టి మొదటి సినిమా ఉప్పెన ఘన విజయం అందుకుంది. ఈ సినిమాతో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. Photo : Instagram
ఇక ఆ సినిమా తర్వాత అందాల భామ కృతిశెట్టి, నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ నటించి మరో విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత నాగచైతన్య సరసన బంగార్రాజులో నటించి మరో హిట్‌ను అందుకుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా... తాజాగా రామ్ పోతినేనితో చేసిన ది వారియర్, నితిన్ హీరోగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. Photo : Instagram
ఇక తాాజగా ఈ భామ నటించిన లేటెస్ట్ సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సుధీర్ బాబు హీరోగా నటించారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే చేతులెత్తేసింది. ఈ సినిమాపై బోలేడన్ని ఆశలు పెట్టుకున్నా కృతి బాగా అప్ సెట్ అయ్యిందట. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ మూవీకి తొలిరోజే నెగెటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో కృతి ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చిపడింది. Photo : Instagram
కెరీర్ బిగినింగ్‌లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కృతిశెట్టికి ఇలా వరుసగా హ్యాట్రిక్ ఫ్లాపులు రావడంతో తెగ ఆందోళన చెందుతోందట. వరుసగా ప్లాపులు రావడంతో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంకో సినిమా కనుక ప్లాప్ అయితే ఆమె కెరీర్ డేంజర్లో పడే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రస్తుతం కృతి చేతిలో నాగచైతన్య కస్టడి మాత్రమే ఉంది. చూడాలి మరి ఈ భామ ఈ సినిమాతోనైనా హిట్ కొడుతుందో.. లేదో.. ఇక తమిళ్‌తో పాటు మలయాళంలో కొన్నిసినిమాలు చేస్తోంది కృతి.
ఇక వరుసగా సినిమాలు ఫ్లాప్స్ అవ్వడంతో కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఉప్పెన హిట్ తర్వాత వరుసగా సినిమాలను చేసి అంతే వరుసగా ఫ్లాప్స్‌ను మూట గట్టుకుంది కృతి శెట్టి. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని రోజుల వరకు కొత్త సినిమాలను ఒప్పుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భామను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దెబ్బతీశాయి. ఆమె నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఇక రిసెంట్‌గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రూపంలో మూడు ఫ్లాప్‌లు ఆమె ఖాతాలో చేరాయి. Photo : Instagram
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతిశెట్టి, తన మరో కోస్టార్, నటుడు నాగచైతన్య గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ... ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా వరకు హీరోయిన్స్ రకరకాల ఇబ్బందుల్నీ ఎదుర్కోంటారు.. నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ రాలేదని తెలిపారు. ఇక ఆమె నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. ఆయనతో వర్క్ చేసేటప్పుడు తను ఎంత ప్రశాంతంగా ఉంటారో అర్థం అయిందని తెలిపారు. Photo : Instagram
ఆమె ఇంకా మాట్లాడుతూ నాగచైతన్య ఏ విషయంలోనైనా ఎంతో నిజాయితీగా ఉంటారని.. ఆయనది ఎంతో స్వచ్ఛమైన మనస్సు అని.. ఆయన వ్యక్తిత్వం ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని పేర్కోన్నారు కృతిశెట్టి.. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృతి శెట్టి గతంలో చైతన్యతో బంగార్రాజు చిత్రంలో నటించారు. అంతేకాదు ఆమె చైతన్యతో మరో చిత్రంలోను నటిస్తున్నారు. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. Photo : Instagram
Krithi Shetty: కృతి శెట్టి ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారారు. ఈ సినిమా ఇచ్చిన పాపులారిటీతో ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది ఈ కన్నడ అందం. అందులో భాగంగా కృతి శెట్టి రామ్ పోతినేని హీరోగా వచ్చిన ది వారియర్ చిత్రంలో నటించారు. ఈ సినిమా జూలై 14న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. (Instagram/Photo)
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni)రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో ‘ది వారియర్’ అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (krithi shetty)నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది . (Instagram/Photo)
‘ది వారియర్’ చిత్రంలో రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (krithi shetty)నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ‘ది వారియర్’ సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో చిత్ర యూనిట్ ఓ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175, మల్టీఫ్లెక్స్‌లో రూ. 295గా నిర్ణయించారు. ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 147, మల్టీఫ్లెక్స్‌లో రూ. 177 గా నిర్ణయించారు. . (Instagram/Photo)
ఇక కృతి శెట్టి ఇటీవల నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ భామ నాగార్జున, నాగ చైతన్య ఫ్యామిలీ మల్టీస్టారర్ ‘బంగార్రాజు’లో చైతూ జోడిగా నాగ లక్ష్మి పాత్రలో నటించింది. మరోసారి నాగ చైతన్యతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. (Instagram/Photo)
కానీ ఈమె పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే. వీళ్ల నాన్న ప్రముఖ బిజినెస్ మ్యాన్. తల్లి ఫ్యాషన్ డిజైనర్‌గా పలు సినిమాలకు పని చేసారు. అంతేకాదు సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు డిమాండ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలని చూస్తారు చాలా మంది నటీనటులు. ఆ ఫార్ములాను ఫాలో అవుతూ వరుస అవకాశాలను ఒడిసిపడుతోంది. (Krithi shetty Photo : Instagram)
ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది కృతి శెట్టి. ’ఉప్పెన’ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగానే యూజ్ చేసుకుంటోంది. తొలి సినిమా విడుదల తర్వాత కథానాయికగా కృతి శెట్టి క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఈ అమ్మడు తన అందచందాలతో పాటు నటనతో ఇండస్ట్రీని ఊపేయడానికి వచ్చినట్లే ఉంది. (Instagram/Photo)
తొలి సినిమా విడుదల కాకముందే ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అందులో భాగంగా నాచురల్ స్టార్ నాని సరసన ’శ్యామ్ సింగరాయ్’ లో ఓ కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా విడుదలైన ఈ మూవీతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది బేబమ్మ. దాంతో పాటు రామ్ పోతినేని సినిమాతో పాటు పలు హీరోల సినిమాల్లో ఈ భామనే సెలెక్ట్ చేసారు. Photo : Twitter
ఈ సినిమాలో ఈ భామకు రూ. 60 లక్షల రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినట్టు సమాచారం. తొలి సినిమా ఉప్పెన కోసం రూ. 6 లక్షల పారితోషకం తీసుకున్న ఈ భామ ఇపుడు ఏకంగా రూ. 60 లక్షల రేంజ్‌కు ఎదిగింది. దీంతో పాటు కృతి శెట్టి.. పోసాని సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇందులో తెలంగాణ పల్లె పడుచు పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ఆ అమ్మాయి గురించి చెప్పాలి అనే టైటిల్ కన్ఫామ్ చేశారు.(Twitter/Photo)
దీంతో పాటు కృతి శెట్టి.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌తో పాటు యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో ఈ భామకు అవకాశం దక్కినట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం వెలుబడాల్సి ఉంది. అంతేకాదు ఇపుడు భారీ ప్రాజెక్ట్‌లో ఈ భామకు హీరోయిన్ ఆఫర్ వచ్చిందట. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఏకంగా రూ. కోటి డిమాండ్ చేసినట్టు సమాచారం. (Instagram/Photo)