సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కచ్చితంగా కొత్త అందాలు వచ్చినపుడు పాత అందాలు సైడ్ ఇచ్చిపడేయాలంతే. కొందరు స్టార్ హీరోయిన్లు వాళ్లను తట్టుకుని కూడా నిలబడుతుంటారు. కొత్త వాళ్లు వచ్చినా కూడా తమ సత్తా చూపిస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి స్టార్ హీరోయిన్లు సత్తా చూపిస్తూనే ఉన్నారు. అంతలోనే ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు దూసుకొస్తున్నారు. వరస సినిమాలు చేసుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. ముఖ్యంగా 2021లో వచ్చిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు వరస అవకాశాలు అందుకుంటూ రప్ఫాడిస్తున్నారు.
7. అమృత అయ్యర్: రామ్ పోతినేని రెడ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది అమృత. చిన్న సినిమాలకు ఈమె కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ముఖ్యంగా మీడియం బడ్జెట్ సినిమాల్లో బాగా నటిస్తుంది అమృత. మొన్నటికి మొన్న శ్రీవిష్ణు అర్జున ఫల్గుణలో కూడా ఈమె హీరోయిన్గా కనిపించింది. ఇప్పుడు హనుమాన్లో అమృత నటిస్తుంది.