Happy Birthday Krithi Shetty : సెట్స్‌లో పుట్టినరోజు జరుపుకున్న ఉప్పెన భామ కృతి శెట్టి.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా సెట్స్‌లో కృతి శెట్టి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. (Twitter/Photo)
కృతి శెట్టి తల్లిదండ్రుల స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు. 21 సెప్టెంబర్ 2003లో జన్మించింది. కానీ ఈమె పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే. వీళ్ల నాన్న ప్రముఖ బిజినెస్ మ్యాన్. తల్లి ఫ్యాషన్ డిజైనర్‌గా పలు సినిమాలకు పని చేసారు. అంతేకాదు సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఈమె ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో పాటు రామ్ పోతినేని, లింగుసామి సినిమాతో పాటు ‘శ్యామ్ సింగరాయ్’ మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటిస్తోంది. (Twitter/Photo)