Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ సహా పలువురు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో ఎక్కువగా శోభన్ బాబు, కృష్ణంరాజులతో ఎక్కువ మల్టీస్టారర్స్ మూవీస చేసారు. ఆయా హీరోలతో చేసిన సినిమాల విషయానికొస్తే.. (twitter/Photo)
ఆ తర్వాత ‘లక్ష్మీ నివాసం’, మా మంచి అక్కయ్య, పుట్టినిల్లు మెట్టినిల్లు, మంచి మిత్రులు, గంగ మంగ, కురుక్షేత్రం, కృష్ణార్జునులు, మండే గుండలు, ముందడుగు, ఇద్దరు దొంగలు, మహా సంగ్రామం, సినిమాల్లో కలసి నటించారు. చిరవగా ఆస్తి మూరెడు ఆస్తి బారేడు సినిమాలో మాత్రం కృష్ణ అతిథి పాత్రలో మెరిసారు. (File/Photo)
అటు రెబల్ స్టార్ కృష్ణంరాజుతో సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువ మల్టీస్టారర్ మూవీస్ చేశారు. ముందుగా నేనేంటే నేను సినిమాలో కలిసి నటించారు. అందులో కొన్ని చిత్రాల్లో కృష్ణంరాజు నెగిటివ్ పాత్రల్లో నటించారు. అటు మమత, మళ్లీ పెళ్లి, అనురాధ, శ్రీవారు మావారు, ఇన్స్పెక్టర్ భార్య, అమ్మకోసం, మళ్లీ పెళ్లి, భలే అబ్బాయిలు, ఇల్లు ఇల్లాలు, భలే మోసగాడు చిత్రాల్లో నటించారు. (File/Photo)(File/Photo)
అటు బాలకృష్ణతో కృష్ణ.. సుల్తాన్ సినిమాలో కలిసి నటించారు. దివంగత సూపర్ స్టార్ కృష్ణ, దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు, నట సింహం బాలకృష్ణ అపూర్వ కలయికలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం . బాలయ్య సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణ, కృష్ణంరాజులతో బాలకృష్ణ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. (File/Photo)
కృష్ణ, నాగార్జున కాంబినేషన్లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’. ఈ చిత్రంలో వీళ్లిద్దరు తండ్రీ కొడుకులుగా నటించారు. ఈ చిత్రంలో నాగ్.. కృష్ణ కాలర్‌ను పట్టుకోవడం అప్పట్లో పెను దుమరమే రేగింది. హీరోగా ఉన్న కృష్ణ ఈ పాత్ర చేయడాన్ని కృష్ణ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత రాముడొచ్చాడు సినిమాలో కలిసి నటించారు. ఇందులో వీళ్లిద్దరి కాంబినేషన్ సీన్స్ ఉండవు. (File/Photo)
అటు యువ నటుడు ఆది సాయి కుమార్ కూడా సూపర్ స్టార్ కృష్ణతో ‘సుకుమారుడు’ సినిమాలో నటించారు. అలనాటి హీరోలతో పాటు యువ నటులతో కూడా సూపర్ స్టార్ కృష్ణ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మొత్తంగా మల్టీస్టారర్స్ విషయంలో కృష్ణను మించిన హీరో లేరనే చెప్పాలి. ఒక విధంగా మల్టీస్టారర్స్ విషయంలో మిగతా హీరోలు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. (Twitter/Photo)