Krishna Movies Jeetendra Ramekae: సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. అందులో చాలా సినిమాలను హిందీలో రీమేక్ చేసారు. అందులో ఎక్కువ చిత్రాలు హిందీలో జితేంద్ర రీమేక్ చేసారు. మొత్తంగా కృష్ణ సినిమాలో హిందీలో జితేంద్ర రీమేక్ చేసిన సినిమాల విషయానికొస్తే.. (Twitter/Photo)
1.గూఢచారి 116- ఫర్జ్ | సూపర్ స్టార్ కృష్ణ భారతీయ తెరపై తొలిసారి జేమ్స్‌బాండ్ తరహా సీక్రెట్ ఏజెంట్ గూఢచారి పాత్రలో నటించిన సినిమా ‘గూఢచారి 116’. M.మల్లిఖార్జున రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో ‘ఫర్జ్’ టైటిల్‌తో జితేంద్ర హీరోగా రీమేక్‌గా తెరకెక్కింది. బాలీవుడ్లో రవికాంత్ నగాయిచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. జితేంద్ర హీరోగా రీమేక్ చేసిన తొలి చిత్రం ఇదే. అక్కడ నుంచి తెలుగు సహా దక్షిణాది భాషల చిత్రాలను హిందీలో రీమేక్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు జితేంద్ర అనే చెప్పాలి. (File/Photo)
2.నేనంటే నేనే - వారిస్ | సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వి.రామచంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో జితేంద్ర హీరోగా వారిస్ పేరుతో రీమేక్ అయింది. అక్కడ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక నేనంటే నేనే చిత్రం తమిళ చిత్రం ‘నాన్’ మూవీకి రీమేక్. తెలుగులో పలు మార్పులతో తెరకెక్కించారు. (File/Photo)
3. పచ్చని సంసారం - హిమ్మత్ ఔర్ మెహనత్ | సూపర్ స్టార్ కృష్ణ హీరోగా లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ ‘పచ్చని సంసారం’ చిత్రాన్ని హిందీలో జితేంద్ర హీరోగా ‘హిమ్మత్ ఔర్ మెహనత్’ పేరుతో రీమేక్ చేసారు. ఇక కృష్ణ చాలా యేళ్ల తర్వాత అదే ‘పచ్చని సంసారం’ టైటిల్‌తో సినిమా చేసి హిట్ అందుకున్నారు. (File/Photo)
అంతం కాదిది ఆరంభం - మేరీ ఆవాజ్ సునో | సూపర్ స్టార్ కృష్ణ హీరోగా విజయ నిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతం కాదిది ఆరంభం’ చిత్రాన్ని హిందీలో జితేంద్ర హీరోగా ‘మేరీ ఆవాజ్ సునో’ పేరుతో రీమేక్ చేస్తే అక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ఆ తర్వాత చాలా కాలానికి హిందీలో ఇదే చిత్రాన్ని సునీల్ శెట్టి ‘కృష్ణ’ పేరుతో రీమేక్ చేసారు. ఆ స సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (File/Photo)
దేవుడు చేసిన మనుషులు - టక్కర్ | సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ హీరోలుగా పద్మాలయా సంస్ధ పతాకంపై వి.రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాన్ని హిందీలో ‘టక్కర్’ పేరుతో జితేంద్ర, సంజీవ్ కుమార్ ముఖ్యపాత్రలో రీమేక్ చేసారు. అక్కడ కూడా ఈ సినిమా బంపర్ హిట్‌గా నిలిచింది. ఇక తెలుగులో విలన్‌గా జగ్గయ్య వేసిన పాత్రను హిందీలో వినోద్ మెహ్రా చేసారు. (File/Photo)
రహస్య గూఢచారి - రక్ష | సూపర్ స్టార్ కృష్ణ, జయపద్ర హీరో, హీరోయిన్లుగా కే.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మరో బాండ్ మూవీ ‘రహస్య గూఢచారి’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో జితేంద్ర, పర్వీన్ బాబీ హీరో, హీరోయిన్లుగా ‘రక్ష’ పేరుతో రీమేక్ చేసారు. అక్కడ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
ఊరికి మొనగాడు - హిమ్మత్ వాలా | సూపర్ స్టార్ కృష్ణ హీరోగా జయప్రద హీరోయిన్గా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఊరికి మొనగాడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు జితేంద్ర హీరోగా శ్రీదేవి హీరోయిన్గా ‘హిమ్మత్వాలా’ టైటిల్‌తో రీమేక్ చేశారు. అక్కడ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో శ్రీదేవి టాప్ హీరోయిన్గా హిందీ చిత్ర సీమలో నెంబర్ వన్ హీరోయిన్గా తన స్థానాన్ని సుస్దిరం చేసుకుంది. ఆ తర్వాత చాలా యేళ్లకు అజయ్ దేవ్‌గణ్.. ఇదే చిత్రాన్ని ‘హిమ్మత్వాలా’ టైటిల్‌తో రీమేక్ చేస్తే అంతగా వర్కౌట్ కాలేదు. (File/Photo)
ముందడుగు - మక్సద్ | షూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కే.బాపయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ముందడుగు’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదే చిత్రాన్ని హిందీలో బాపయ్య దర్శకత్వంలోనే కృష్ణ పాత్రలో జితేంద్ర, శోభన్ బాబు పాత్రలో రాజేష్ ఖన్నా హీరోలుగా చేసారు. ఈ చిత్రం కూడా బాక్పాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
ఈనాడు - యే దేశ్ | సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 200వ చిత్రం ‘ఈనాడు’. పొలిటికల్ సైటైర్ మూవీగా పద్మాలయా సంస్థ బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పర్వతనేని సాంబశివరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో జితేంద్ర, కమల్ హాసన్ హీరోలుగా ‘యే దేశ్’ పేరుతో పి.మల్లిఖార్జున రావు దర్శకత్వంలో రీమేక్ చేసారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ‘ఈనాడు’ చిత్రాన్ని మలయాళంలో హిట్టైన ‘ఏకలవ్య’ చిత్రాన్ని ప్రేరణగా తీసుకొని కృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు పలు మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. (File/Photo)
చుట్టాలున్నారు జాగ్రత్త - మవాళి | సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయంలో బాలయ్య దర్శకత్వంలో అమృతా ఫిలిమ్స్ బ్యానర్లో శ్రీదేవి, కవిత హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘చుట్లాలున్నారు జాగ్రత్త’ . ఈ చిత్రాన్ని హిందీలో జితేంద్ర హీరోగా ‘మవాళి. పేరుతో రీమేక్ చేసారు. హిందీలో శ్రీదేవి వేసిన పాత్రను జయప్రద చేసారు. ఇక కవిత పాత్రను హిందీలో శ్రీదేవి చేయడం విశేషం. అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. (File/Photo)
అడవి సింహాలు - జానీ దోస్తీ | సూపర్ స్టార్ కృష్ణ,రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోలుగా కే. రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ‘అడవి సింహాలు’ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో తెరకెక్కింది. హిందీలో జితేంద్ర, ధర్మేంద్ర హీరోలుగా నటించారు.తెలుగులో మంచి విజయం అందుకున్న ఈ చిత్రం హిందీలో అంతగా వర్కౌట్ కాలేదు. (Twitter/Photo)
సింహాసనం - సింఘాసన్ | సూపర్ స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో ఆయనే హీరోగా అప్పట్లోనే 70 MM 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్‌తో ’సింహాసనం’ చిత్రాన్ని ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో తెరకెక్కించారు. హిందీలో జితేంద్ర హీరోగా నటించారు. దాదాపు సింహాసనం ఉన్న నటీనటులే హిందీలో యాక్ట్ చేసారు. ఇక తెలుగు సత్యనారాయణ వేసిన విలన్ వేషాన్ని హిందీలో ప్రాణ్ చేసారు. ఇక ప్రభాకర్ రెడ్డి వేసిన రోల్‌ను ఖాదర్ ఖాన్ చేసారు. హిందీలో కూడా ఈ సినిమా మంచి విజయాన్నే నమోదు చేసింది. (Twitter/Photo)