Home » photogallery » movies »

KRISHNA KRISHNAM RAJU K RAGHAVENDRA RAO ADAVI SIMHALU MOVIE COMPLETED 38 YEARS TA

Krishna - K Raghavendra Rao: కృష్ణ, రాఘవేంద్ర రావు కలయికలో వచ్చిన ఆ సూపర్ హిట్ సినిమాకు 38 ఏళ్లు..

Krishna - K Raghavendra Rao | తెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు, కృష్ణ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మొత్తంగా వీళ్ల కాంబినేషన్‌లో 9 చిత్రాలు తెరకెక్కాయి. అందులో అన్ని చిత్రాలు 100% సక్సెస్ సాధించాయి. అందులో ‘అడవి సింహాలు’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రం విడుదలైన నేటితో 38 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. కృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన 4వ చిత్రం. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరి కలయికలో మరో నాలుగు చిత్రాలు వచ్చాయి.