మా మీద దయుంచి మీరే కాస్త ఇలాంటివి అరికట్టండి.. ఇది విని కాస్త పెద్దవాళ్లుంటే గుండె ఆగి చచ్చిపోతారని పోలీసులకు చెప్పాను. ఇలాంటి వదంతులు మీరు నమ్మొద్దని మనవి చేస్తున్నా. మిగతావాళ్లకు తెలియ జేయండి. ఇది చూసైనా వాళ్లకు బుద్ధి వస్తుంది. జీవితంలో డబ్బు సంపాదించడానికి చండాలపు పనులు బోలెడు ఉన్నాయి. ఇది అక్కర్లేదు. మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు. అంతే. నమస్కారం అని కోట శ్రీనివాసరావు అన్నారు.
1942, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు కోట శ్రీనివాస రావు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే చాలా ఆసక్తి పెంచుకున్న కోట.. సినీ నటుడిగా తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.