అదే సమయంలో బాబు మోహన్ కూడా ఆందోళ్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు చంద్రబాబు క్యాబినేట్లో మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత బాబు మోహన్ మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాదు వీళ్ల కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా బి.గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘బొబ్బిలి రాజా’.
కానీ ఆహ్వానం సినిమాలో మాత్రం కోట శ్రీనివాస రావు .. బాబు మోహన్ అబ్బాయి పాత్రలో నటించడం విశేషం. చివరగా బాబు మోహన్ గత సార్వత్రిక ఎన్నికల ముందు కోట శ్రీనివాస రావు ప్రాతినిధ్యం వహించిన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరు సినిమాలను తగ్గించేసారు. వారికి తగ్గ పాత్రలు వస్తే చేస్తున్నారు. (File/Photo)