ఈ రోజు ఉదయం నుంచి నటుడు కోట శ్రీనివాస రావు మృతి అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ సందర్భంగా నటుడు కోట స్వయంగా ఓ వీడియో విడుదల చేసిన నేను బతికే ఉన్నాను అంటూ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ నటి హేమ .. హైదరాబాద్ బషీర్ బాగ్‌లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియాలో వస్తోన్న అసంబద్ధ అసత్య వార్తలు ప్రసారం చేస్తోన్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. (Twitter/Photo)
సోషల్ మీడియా ఇదో పవర్ ట్రాన్స్ఫార్మర్ లాంటిది. సరిగా ఉపయోగించుకుంటే ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. అదే తేడా కొడితే.. షాక్ కొట్టక తప్పదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అసలైన వార్తలతో పాటు నకిలీ వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి. తాజాగా నటుడు కోట శ్రీనివాస రావు చనిపోయాడంటూ ఈ రోజు ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి హేమ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
మా మీద దయుంచి మీరే కాస్త ఇలాంటివి అరికట్టండి.. ఇది విని కాస్త పెద్దవాళ్లుంటే గుండె ఆగి చచ్చిపోతారని పోలీసులకు చెప్పాను. ఇలాంటి వదంతులు మీరు నమ్మొద్దని మనవి చేస్తున్నా. మిగతావాళ్లకు తెలియ జేయండి. ఇది చూసైనా వాళ్లకు బుద్ధి వస్తుంది. జీవితంలో డబ్బు సంపాదించడానికి చండాలపు పనులు బోలెడు ఉన్నాయి. ఇది అక్కర్లేదు. మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు. అంతే. నమస్కారం అని కోట శ్రీనివాసరావు అన్నారు.
తెలుగు తెరపై కోట శ్రీనివాసరావుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. క్రాంతి కుమార్ నిర్మాణంలో కే.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో నటుడిగా కోట ప్రస్థానం మొదలైంది. హీరోగా చిరంజీవికి కూడా అదే ఫస్ట్ మూవీ. ఆ తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తర్వాత టి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతి ఘటన’ కోటకు బిగ్ బ్రేక్‌ను ఇచ్చింది. ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి అలరించిన ఆయన పలు అవార్డ్స్ అందుకున్నారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కోట చేసిన ఎన్నో పాత్రలు ప్రేక్షకుల మెప్పు పొందాయి.
1942, జులై 10న తెలుగు సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు కోట శ్రీనివాస రావు. కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే చాలా ఆసక్తి పెంచుకున్న కోట.. సినీ నటుడిగా తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈయన తమ్ముడు కోట శంకర్ రావు కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.