NTR 30 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు రాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే లొకేషన్స్ సిద్ధం చేసుకున్న కొరటాల.. మొదటి షెడ్యూల్ను శంషాబాద్లో భారీ సెట్ వేసి చిత్రీకరించబోతున్నారట. ఆ వెంటనే రెండో షెడ్యూల్ను గోవాలో ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సెట్స్ కోసం ఈ మూవీ నిర్మాతలు పెద్ద మొత్తంలో బడ్జెట్ రిలీజ్ చేశారని సమాచారం.