Kollywood Heroes In Tollywood | ‘బాహుబలి’ పుణ్యామా అని ఇపుడు అన్ని ఇండస్ట్రీస్‌లో ప్యాన్ ఇండియా మూవీస్ తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్. అంతకు ముందు తెలుగు హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్లు ఒకవైపు తెలుగులో నటిస్తూనే తమిళంలో కూడా సత్తా చాటారు. మరోవైపు తమిళ హీరోలైన రజినీకాంత్, కమల్ హాసన్ వంటి కథానాయకులు కూడా టాలీవుడ్లో డబ్బింగ్ సినిమాలతో పాటు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పలకరించారు. తాజాాగా విజయ్, ధనుశ్, సూర్య వంటి హీరోలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులో దండయాత్రలు చేస్తూనే.. స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పలకరించడానికి రెడీ అవుతున్నారు. వీళ్ల కంటే ముందు తెలుగులో సత్తా చాటిన తమిళ తంబీలెవరున్నారో మీరు ఓ లుక్కేయండి.. (Twitter/Photo)
ఇక తమిళ అగ్ర హీరో విజయ్ కూడా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో డైరెక్ట్‌గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు విజయ్.వంశీ పైడిపల్లితో విజయ్ చేయబోయే ప్యాన్ ఇండియా సినిమా కోసం దిల్ రాజు విజయ్‌కు ఏకంగా రూ. 100 కోట్ల పారితోషకం ఇవ్వబోతున్నాడట. (Twitter/Photo)
సూర్య | తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఐతే... ఇప్పటి వరకు తమిళ డబ్బింగ్ సినిమాలతో పలకరించిన సూర్య.. ఇపుడు బోయపాటి శ్రీను సినిమాతో మరోసారి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో సూర్య.. ‘రక్త చరిత్ర 2’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
కమల్ హాసన్ |కమల్ హాసన్ కూడా తెలుగులో ‘మరో చరిత్ర’, ‘అంతులేని కథ’, ఆకలి రాజ్యం’ ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘స్వాతి ముత్యం’, సాగర సంగమం’, ‘శుభ సంకల్పం’ వంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటించిన మూడు నంది అవార్డులను కూడా అందుకున్న ఏకైక పరభాషా నటుడిగా కమల్ హాసన్ రికార్డ్స్ క్రియేట్ చేసారు. (Twitter/Photo)
సత్యరాజ్ | సత్యరాజ్ కూడా అపుడెపుడే శోభన్ బాబు హీరోగా నటించిన ‘ఇద్దరు కొడుకులు’ సినిమాతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చాలా యేళ్ల తర్వాత ‘శంఖం’ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి ‘బాహుబలి’లో కట్టప్పగా తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారత దేశ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే కదా. డైరెక్ట్‌గా హీరోగా చేయకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరిస్తున్నారు. (Twitter/Photo)