Shankar - Lingusamy: తెలుగు ఇండస్ట్రీ పై ఫోకస్ పెడుతున్న తమిళ దర్శకులు.. శంకర్ నుంచి లింగుస్వామి వరకు టాలీవుడ్ పై ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్నారు. వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తూ రెండు భాషలకు చెందిన ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. వీళ్ల బాటలో మరికొందరు తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్నారు. (Twitter/Photo)
ఈ సినిమా కోసం శంకర్, రామ్ చరణ్ కన్న ఎక్కువ పారితోషకం తీసుకోబోతున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్గా తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎక్కువగా తెలుగు నటులే ఈ సినిమాలో నటిస్తున్నారు. (Twitter/Photo)
ప్రభుదేవా కూడా కన్నడ మూలాలున్న తమిళుడు. ఈయన తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటనా’ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత శంకర్ దాదా జిందాబాద్’, ‘పౌర్ణమి’ చిత్రాలను డైరెక్ట్ చేసారు. అటు తమిళంలో హిందీలో దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. (prabhu deva)