KOFFEE WITH KARAN SEASON 7 PROMO SAMANTHA COMMENTS ON HER MARRIED LIFE SLB
Samantha: పెళ్లి తర్వాత సంతోషంగా ఉండకపోవడానికి కారణం..! ఎట్టకేలకు సమంత ఓపెన్
Samantha Comments on Her marriage life: సమంత డివోర్స్ తీసుకోవడానికి కారణాలివే అంటూ ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాఫీ విత్ కరణ్ ప్రోమో విడుదల చేయగా అందులో సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ సమంత (samantha ruth prabhu) పెళ్లి మ్యాటర్.. ఆ తర్వాత డివోర్స్ మ్యాటర్ ఎంతగా వైరల్ అయిందో మనందరికీ తెలుసు. అక్కినేని నాగ చైతన్యను పెళ్లాడిన సమంత నాలుగేళ్ల పాటు ఆయనతో కాపురం చేసి చివరకు అనూహ్యంగా తన వివాహ బంధానికి బ్రేక్ చెప్పింది.
2/ 8
సమంత- నాగ చైతన్య డివోర్స్ తీసుకుంటున్నారని తెలిసి అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే వీరిద్దరూ అధికారిక ప్రకటన ఇవ్వడంతో చైసామ్ విడాకులు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే ఈ ఇష్యూపై ఎన్నో రకాల వార్తలు షికారు చేశాయి. సమంత డివోర్స్ తీసుకోవడానికి కారణాలివే అంటూ ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి.
3/ 8
ఈ నేపథ్యంలో తాజాగా ఫస్ట్ టైమ్ పెళ్లి బంధంపై ఓపెన్ అయింది సమంత. పెళ్లి తరువాత జీవితంపై ఉండే ఎక్స్పెక్టేషన్స్ గురించి కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ (koffee with karan season 7) షోలో చెప్పేసింది.
4/ 8
తాజాగా కాఫీ విత్ కరణ్ ప్రోమో విడుదల చేయగా అందులో సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కరణ్ జోహర్ హోస్ట్ గా చేస్తున్న కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్లో సమంత పార్టిసిపేట్ చేసింది. ఈ సీజన్ వచ్చే వారం నుంచి హాట్ స్టార్‌లో ప్రసారం కాబోతోంది.
5/ 8
కొద్దిసేపటి క్రితం ఈ షో ప్రోమో రిలీజ్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఈ ప్రోమో వీడియోలో బాలీవుడ్ స్టార్స్‌తో పాటు సమంత కనిపించారు. ఇందులో వరుణ్ ధావన్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అలియా భట్ వంటి స్టార్స్ కనిపించారు.
6/ 8
ఇందులో భాగంగా తన పెళ్లి గురించి సమంత చెప్పిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. పెళ్లి తర్వాత జీవితం అనుకున్నంత సంతోషంగా ఉండకపోవడానికి కారణం మీరే (కరణ్ జోహర్) అనేసింది సమంత.
7/ 8
పెళ్లి తర్వాత జీవితం కభీ ఖుషీ కబీ ఘమ్లా ఉంటుందని చూపించారు.. కానీ రియాల్టీలో మాత్రం డిఫరెంట్ గా ఉంది. పెళ్లి తర్వాత లైఫ్ కేజీయఫ్లా ఉంటుందని పరోక్షంగా తన మ్యారేజ్ లైఫ్‌పై కౌంటర్ వేసుకుంది సమంత. దీంతో ఈ కామెంట్స్ జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
8/ 8
మొత్తానికి తొలిసారి సమంత ఇలా ఓ షోలో తన పెళ్లి, విడాకుల వంటి విషయాల మీద నోరు విప్పబోతోందని ఈ ప్రోమో స్పష్టం చేస్తోంది. సో.. చూడాలి మరి ఈ షోలో సమంత ఏం చెప్పబోతుందనేది!.