‘కొబ్బరిమట్ట’లో పాపా రాయుడు,పెదరాయుడు,ఆండ్రాయుడు అనే మూడు పాత్రల్లో నటించిన సంపూర్ణేష్ బాబు (ట్విట్టర్ ఫోటో)
‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన మెగాస్టార్ చిరంజీవి (యూట్యూబ్ క్రెడిట్)
సీనియర్ ఎన్టీఆర్ కులగౌరవం, శ్రీకృష్ణసత్య, శ్రీమద్విరాట పర్వం వంటి సినిమాల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు చేసారు. కులగౌరవం సినిమాలో ఎన్టీఆర్ తాత, తండ్రి, మనవడిగా నటిస్తే.... దానవీరశూరకర్ణల శ్రీకృష్ణుడిగా, దుర్యోదనుడిగా, కర్ణుడిగా మూడు పాత్రల్లో మెప్పించడం విశేషం. (ట్విట్టర్ ఫోటో)
1969ల వచ్చిన ‘‘నవరాత్రి’ సినిమాలో ఏఎన్నార్ ఏకంగా తొమ్మిది పాత్రలు చేసి నిజంగనే నటనల సామ్రాట్ అనిపించుకున్నాడు, (యూట్యూబ్ క్రెడిట్)
తమిళంలో ‘నవరాత్రి’ టైటిల్ తో శివాజీ గణేషన్ తొమ్మిది పాత్రల్లో ఇదే సినిమాను రీమేక్ చేసారు. (యూట్యూబ్ క్రెడిట్)
‘నవరాత్రి’ సినిమాను హిందీలో సంజీవ్ కుమార్ ‘‘నయా దిన్ నయి రాత్’’ అనే రీమేక్‌లో తొమ్మిది పాత్రల్లో మెప్పించారు.
ఎన్టీఆర్ తర్వాత ఎక్కువ సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసిన హీరో కృష్ణ. ఈ నట శేఖరుడు కుమార్ రాజా, పగపట్టిన సింహం, రక్త సంబంధం, బొబ్బిలిదొర వంటి దాదాపు ఏడు సినిమాల్లో మూడు పాత్రల్లో మెప్పించడం విశేషం. (యూట్యూబ్ క్రెడిట్)
శోభన్ బాబు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో మూడు పాత్రల్లో మెప్పించారు. ఈ సినిమా తమిళంలో రజినీకాంత్ నటించిన ‘మూండ్రు ముగమ్’ సినిమాకు రీమేక్ (యూట్యూబ్ క్రెడిట్)
రజినీకాంత్ ‘మూండ్రు ముగమ్’ సినిమాలో త్రిపాత్రాభినయం చేసారు. ఆ తర్వాత ఇదే సినిమాను హిందీలో ‘జాన్ జానీ జనార్ధన్’ రీమేక్‌లో కూడా రజినీకాంత్ మరోసారి మూడు పాత్రల్లో మెప్పించడం విశేషం.
కమల్ హాసన్ విషయానికొస్తే.. ‘విచిత్ర సోదరులు’ సినిమాలో మూడు పాత్రల్లో మెప్పిస్తే...‘మైఖేల్ మదన కామ రాజు’ చిత్రంలో నాలుగు పాత్రలతో నట విశ్వరూపం చూపించాడు. ఇక ‘దశావతారం’ సినిమాలో ఏకంగా పది పాత్రలు చేసి ఔరా అనిపించాడు. (ఫేస్బుక్ ఫోటో)
తమిళ స్టార్ హీరో సూర్య ...విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘24’ మూవీలో మూడు విభిన్న పాత్రల్లో మెప్పించాడు. (ఫేస్బుక్ ఫోటో)
‘మెర్సల్’తెలుగులో ‘అదిరింది’ పేరుతో వచ్చిన సినిమాలో తండ్రి, కొడుకులుగా త్రిపాత్రాభినయం చేసాడు.(ఫేస్బుక్ ఫోటో)
‘శింబు’ కూడా ‘అంబనవన్ అసరధావన్ అధంగధావన్’ సినిమాలో మూడు పాత్రల్లో మెప్పించాడు. (యూట్యూబ్ క్రెడిట్)
‘మహాన్’ సినిమాలో తండ్రి ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం చేసిన అమితాబ్ బచ్చన్ (యూట్యూబ్ క్రెడిట్)
‘ఇంగ్లీష్ బాబు దేశీ మెన్’ సినిమాలో తండ్రి కొడుకులుగా మూడు పాత్రల్లో మెప్పించిన షారుఖ్ ఖాన్ (ఫైల్ ఫోటో)
‘జియో షాన్ సే’ సినిమాలో బ్రహ్మా, విష్ణు,మహేశ్వర్‌గా మూడు పాత్రల్లో నటించిన ధర్మేంద్ర(యూట్యూబ్ క్రెడిట్)
‘హద్ కర్ దీ ఆప్నే’ సినిమాలో మూడు కన్న ఎక్కువ పాత్రల్లో మెప్పించిన గోవిందా (యూట్యూబ్ క్రెడిట్)
‘వాట్స్ యువర్ రాశీ’ సినిమాలో పన్నెండు పాత్రల్లో మెప్పించిన ప్రియాంక చోప్రా (యూట్యూబ్ క్రెడిట్)
‘హమ్ షకల్స్’ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్,రామ్ కపూర్లు మూడు పాత్రల్లో నటించారు (యూట్యూబ్ క్రెడిట్)