మహేష్ సరసన కియారా కన్ఫామ్డ్.. సమ్మర్‌లో షూటింగ్ స్టార్ట్..

Kiara Advani : కియారా అద్వానీ.. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితేనేం.. హిందీలో ఈ భామ 'అర్జున్ రెడ్డి' రీమేక్.. 'కబీర్ సింగ్‌'లో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది కియారా. తాజా సమాచారం మేరకు కియారా మరోసారి మహేష్ సరసన మరోసారి నటించనుంది. దీనికి సంబందించి ఆమెతో చర్చలు జరపడంతో పాటు కన్ఫర్మ్ కూడా అయ్యిందని తెలుస్తుంది. సమ్మర్ నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.