కియారా మళ్లీ ఆ హీరోకే ఓకే చెప్పిందా...

తెలుగులో కియారా అద్వానీ రీఎంట్రీ ఎప్పుడనే అంశంపై సస్పెన్స్‌కు తెరపడింది. త్వరలోనే తాను మళ్లీ టాలీవుడ్‌లోని ఓ పెద్ద సినిమాలో నటించబోతున్నానని ఈ హాట్ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ పెద్ద సినిమా ఏంటనే విషయాన్ని మాత్రం చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే మహేశ్ బాబు నయా మూవీలో నటించేందుకే కియారా కమిటైందనే టాక్ వినిపిస్తోంది.