Sidharth malhotra - Kiara Advani: బాలీవుడ్ హాటెస్ట్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సిద్ధార్ధ్ మల్హోత్ర, కియారా అద్వానీ గత నెలలో ఒకింటి వారయ్యరు. గత కొన్నేళ్లుగా డేటింగ్ చేసిన వీళ్లిద్దరు జీవిత భాగస్వాములయ్యారు. ఇక మ్యారేజ్ తర్వాత తొలిసారి ఈ నవ దంపతులు ఆ మధ్య హోళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు ఇద్దరు జంటగా యాడ్స్ కూడా చేస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరు కలిసున్న ఫోటోలను కియారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. (Instagram/Photo)
అది అలా ఉంటే కియారా హీరోయిన్గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడు సిద్ధార్ద్ మల్హోత్రను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి ఇటీవలే ఘనంగా జరిగింది. కియారా, సిద్ధార్ధ్‌ల పెళ్లి ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్ సూర్యాఘర్ ప్యాలెస్‌లో బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఇక పెళ్లి తర్వాత ప్రస్తుతం హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోన్న కియారా తన భర్తతో తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Photo : Instagram
అది అలా ఉంటే పెళ్లై కొన్ని రోజులు కూడా కాకుండే సినిమా షూటింగ్లో బిజీ అయింది. కియారా.. తన చిరకాల ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న ఇటీవల హనీమూన్ ట్రిప్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఓ హిందీ సినిమా షూటింగ్లో పాల్గోంటుందని తెలుస్తోంది. అంతేకాదు మరోవైపు రామ్ చరణ్‌తో నటించడానికి ఆమె హైదరాబాద్ కు వచ్చింది.
ఇక కియారా సినిమాల విషయానికి వస్తే.. ఈ భామ తెలుగులో మరోసారి రామ్ చరణ్‌తో కలిసి ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తోంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా టైటిల్‌కు మంచి పేరు వచ్చింది. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్ చేసింది టీమ్. అయితే సినిమా వాయిదా పడే అవకాశం ఉంది.. ఇక ఇందులో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కియారా కనిపించనుందని టాక్. ఈ సినిమా తో పాటు పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉంది. (Instagram/Photo)
ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో పాటు మొత్తం 150మంది వీవీఐపీలను వీరి పెళ్లి వేడుకకు విచ్చేసారు. పెళ్లికి వచ్చే వీవీఐపీల భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సూర్యఘర్ ప్యాలెస్ జైసల్మేర్ నుండి 16 కి.మీ దూరంలో ఉంది. దీన్ని డిసెంబర్ 2010లో జైపూర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త ఈ హోటల్‌ను నిర్మించారు. దాదాపు 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్ లో సకల సదుపాయాలు ఉన్నాయి.
ఇక తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నాయికగా నటించింది. ఇక హిందీలో షాహిద్ కపూర్‌తో చేసిన అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ మూవీ కియారాకు మంచి పేరు తీసుకొచ్చింది. (Instagram/Photo)
ఆ తర్వాత అక్షయ్ కుమార్‌తో ‘లక్ష్మీ’ సినిమాలో నటించింది. అంతకు ముందు ఈమె అక్షయ్ కుమార్ ముఖ్యపాత్రలో నటించిన ‘గుడ్ న్యూస్’లో తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె ‘భూల్ భులయ్యా’, ‘గోవిందా మేరా నామ్’,‘జుగ్ జుగ్ జీయో’ వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు రామ్ చరణ్, శంకర్ ప్యాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’లో యాక్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. (Instagram/Photo)
గతేడాది ‘షేర్షా’ మూవీ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ యేడాది ‘భూల్ భులయ్యా 2’తో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా దాదాపు రూ. 200 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత ‘జుగ్ జుగ్ జియో’ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తాజాగా రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ సినిమా సక్సెస్‌తో కియారా బాలీవుడ్ గోల్డెన్ లెగ్గా పేరు సంపాదించింది (Twitter/Photo)