Kiara Advani Sidharth Malhotra Marriage Updates: బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాజస్థాన్‌లోని సూర్యాఘర్ ప్యాలేస్‌లో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగిందని తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాజస్థాన్‌లోని సూర్యాఘర్ ప్యాలేస్‌లో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగిందని తెలుస్తోంది.
2/ 9
కియారా- సిద్దార్ధ్ వివాహ వేడుకకు సంబంధించి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్ వేదికగా మారింది. ఈ రాజకోటలో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. గత వారం రోజులుగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
3/ 9
నిజానికి ఫిబ్రవరి 6నే ఈ జంట పెళ్లి చేసుకుందని విన్నాం. కానీ అనూహ్యంగా వాయిదా పడి నేడు (ఫిబ్రవరి 7) వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకకు కెమెరాల అనుమతి లేకపోవడంతో ఫొటోస్, వీడియోస్ బయటకు రాలేదు. అయితే ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లోకి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
4/ 9
కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యాని తెలియడంతో ఈ ఇద్దరికీ బెస్ట్ విషెస్ చెబుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా పేర్లు నెట్టింట మారుమోగుతూ ట్రెండ్ అవుతున్నాయి.
5/ 9
కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా ఇద్దరూ కూడా ఫిబ్రవరి 5న జైసల్మేర్ చేరుకున్నారు. అక్కడే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంజాయ్ చేస్తూ ఫోటోషూట్స్ లో పాల్గొన్నారు. పెళ్లికి ముందు మెహందీ, హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
6/ 9
ఫోటో షూట్స్ కోసమే తమ పెళ్లి వేడుకను ఒక రోజు వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. తమ పెళ్లి కోసం ఈ బాలీవుడ్ కపుల్స్ ఏకంగా 10 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. బంధుమిత్రులతో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేసినట్లు తెలుస్తోంది.
7/ 9
అంబరాన్ని తాకే పెళ్లి ఏర్పాట్లతో సూర్యాఘర్ ప్యాలేస్ మెరిసిపోయింది. పెళ్లికి వచ్చే వీవీఐపీల భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అతిథులందరికీ ఫోటోలు పోస్ట్ చేయవద్దని, వీడియోలు తీయొద్దని చెప్పడంతో ఈ వేడుక తాలూకు ఫొటోస్ పెద్దగా బయటకు రాలేదు.
8/ 9
ఫిబ్రవరి 4వ తేదీన మొదలైన కియారా- సిద్దార్ధ్ పెళ్లి సందడి నేటితో ముగిసింది. నాలుగు రోజుల పాటు గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తూ ఇరువురి కుటుంబాలు పెళ్లి వేడుకను బాగా ఎంజాయ్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
9/ 9
గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఫ్యాన్స్‌ని సంబరాల్లో ముంచెత్తుతోంది. ఫిబ్రవరి 12న ముంబైలో సిద్ధార్థ్- కియారా తమ వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారని, దీనికి బాలీవుడ్ ప్రముఖులు మరియు మీడియా సిబ్బందిని ఆహ్వానిస్తారని వివిధ నివేదికలు సూచిస్తున్నాయి.