కొంత గ్యాప్‌తో మళ్లీ తెలుగు ఆడియెన్స్ ని పలకరించబోతుంది. తన అందాలతో పులకరించబోతుంది. ప్రస్తుతం ఆమె రామ్‌చరణ్‌తో మరో సినిమా చేస్తుంది. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్సీ15` చిత్రంలో నటిస్తుంది. ఇది పాన్ ఇండియా లెవల్లో రూపొందుతుండటం విశేషం. (Image Credit : Instagram)
ఇక తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నాయికగా నటించింది. ఇక హిందీలో షాహిద్ కపూర్‌తో చేసిన అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ మూవీ కియారాకు మంచి పేరు తీసుకొచ్చింది. (Image Credit : Instagram)
ఇంకోవైపు డేటింగ్ రూమర్స్ తో సంచలనంగా మారింది కియారా. ప్రస్తుతం ఈ బ్యూటీ `షేర్షా` స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో లవ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరు కలిసి చాలా సార్లు కెమెరాలకు చిక్కారు. ఓ వైపు ఎయిర్పోర్ట్ లో, మరోవైపు పార్టీల్లో కలిసి సందడి చేయడం విశేషం. అంతేకాదు పలు మార్లు సిద్ధార్థ్ ఇంటి వద్ద కూడా కనిపించింది కియారా. దీంతో వీరిద్దరు ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. (Image Credit : Instagram)