Kiara Advani : కియారా అద్వానీ.. గురించి తెలుగు ఆడియన్స్‌కు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ భామసూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్గా హోదా సంపాదించుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో మెరిసింది. అయితే ఆ సినిమా అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయింది. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. (Instagram/Photo)
ఇక ఇపుడు మరోసారి రామ్ చరణ్, శంకర్ ప్యాన్ ఇండియా మూవీలో నటించింది. తాజాగా కియారా అద్వానీ మరోసారి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన మరోసారి తెలుగులో సందడి చేయనుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్ చేసింది టీమ్. అయితే సినిమా వాయిదా పడే అవకాశం ఉంది.. ఇక ఇందులో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కియారా కనిపించనుందని టాక్. (Instagram/Photo)
ఇక తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నాయికగా నటించింది. ఇక హిందీలో షాహిద్ కపూర్‌తో చేసిన అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ మూవీ కియారాకు మంచి పేరు తీసుకొచ్చింది. (Instagram/Photo)
ఆ తర్వాత అక్షయ్ కుమార్‌తో ‘లక్ష్మీ’ సినిమాలో నటించింది. అంతకు ముందు ఈమె అక్షయ్ కుమార్ ముఖ్యపాత్రలో నటించిన ‘గుడ్ న్యూస్’లో తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె ‘భూల్ భులయ్యా’, ‘గోవిందా మేరా నామ్’,‘జుగ్ జుగ్ జీయో’ వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు రామ్ చరణ్, శంకర్ ప్యాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. (Instagram/Photo)