కియారా మళ్లీ మనసు మార్చుకుంటుందా....

ఇండియాలోని ఏ హీరోయిన్‌కైనా అసలు టార్గెట్ బాలీవుడే. మిగతా భాషల్లో ఎన్ని సినిమాలు చేసినా... బాలీవుడ్‌లో బిగ్ హీరోయిన్ అయిపోవాలని ముద్దుగుమ్మలు కలలుకుంటుంటారు. వారిలో కొందరి కలలు మాత్రమే నిజమవుతుంటాయి. తెలుగులో రెండు మూడు సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన కియారా అద్వానీ కూడా ఆ పనిలో బిజీగా ఉంది. మహేశ్ బాబు, రామ్ చరణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కియారా... ఇప్పుడు టాలీవుడ్‌కు నో డేట్స్ అనేస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా మహేశ్ మూవీలో కియారాకు అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. మరి... కియారా మళ్లీ బ్యాక్ టు టాలీవుడ్ అంటుందా ? లేక బాలీవుడ్‌కే ఫిక్స్ అవుతుందా అన్నది చూడాలి.