Kiara Advani: కియారా పెళ్లికి రెడీ అయ్యిందా ? ఈ బ్యూటీ బాయ్‌ఫ్రెండ్ మాటలకు అర్థం అదేనా ?
Kiara Advani: కియారా పెళ్లికి రెడీ అయ్యిందా ? ఈ బ్యూటీ బాయ్‌ఫ్రెండ్ మాటలకు అర్థం అదేనా ?
Kiara Advani: సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి గురించి సూటిగా సమాధానం ఇవ్వకుండా ఇలా చెప్పడంతో.. అతడు తన గర్ల్‌ఫ్రెండ్ కియారాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడా ? అనే పుకార్లు షికారు చేస్తున్నాయి.
కెరీర్ బాగా సాగుతున్న సమయంలో పెళ్లి గురించి ఆలోచించరు హీరోయిన్లు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం అన్నీ అనుకూలిస్తే పెళ్లికి ఓకే చెబుతుంటారనే టాక్ ఉంది. తాజాగా అందాల భామ కియారా అద్వానీ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీగానే ఉందా ? అనే గుసగుసలు మొదలయ్యాయి.
2/ 7
ఇందుకు అసలు కారణం బాలీవుడ్ యంగ్ హీరో, కియారా అద్వానీ బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలే. షేర్షా మూవీ సక్సెస్‌తో మంచి జోష్ మీదున్న సిద్దార్థ్ మల్హోత్రా.. కొంతకాలంగా కియారా అద్వానీతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు ఊహాగానాలు వినిపించాయి.
3/ 7
తాజాగా తన పెళ్లి గురించి సిద్దార్థ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా హీరోలను పెళ్లి ఎప్పుడని ప్రశ్నిస్తే.. ఇప్పుడే కాదని చెబుతుంటారు. కానీ సిద్దార్థ్ మల్హోత్రా మాత్రం ఇందుకు భిన్నంగా సమాధానం ఇచ్చాడు.
4/ 7
తాను జ్యోతిష్యుడుని కాదని.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని కామెంట్ చేశాడు. ఏదైనా జరిగితే అందరికీ చెబుతానని అన్నాడు.
5/ 7
సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి గురించి సూటిగా సమాధానం ఇవ్వకుండా ఇలా చెప్పడంతో.. అతడు తన గర్ల్‌ఫ్రెండ్ కియారాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడా ? అనే పుకార్లు షికారు చేస్తున్నాయి.
6/ 7
మరోవైపు కియారా గురించి ప్రస్తావిస్తే.. ఆమె గురించి గొప్పగా చెప్పాడు సిద్దార్థ్. నటిగా కంటే ఆమె మంచి వ్యక్తి అని చెప్పుకొచ్చాడు. ఆమెలో మార్చుకోవాల్సిన అంశాలేవీ లేవని అన్నాడు.
7/ 7
కియారాతో రొమాంటిక్ సినిమా చేయాలని ఉందని వ్యాఖ్యానించాడు. మొత్తానికి సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లిపై చేసిన కామెంట్స్.. మరోసారి కియారా పెళ్లి చేసుకోబోతోందా అనే చర్చ మొదలయ్యేలా చేసింది.