Kiara advani birthday: అందాల బొమ్మ కియారా బర్త్ డే..కియారా లైఫ్ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు
Kiara advani birthday: అందాల బొమ్మ కియారా బర్త్ డే..కియారా లైఫ్ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు
Kiara advani birthday : కియారా అద్వానీ.. తన అందంతో పాటు నటనతోనూ సినీ ప్రేక్షకులని ఫిదా చేస్తున్న బాలీవుడ్ నటి. ఈరోజు జూలై 31న కియారా తన 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కియారా అద్వానీ జీవితానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకోండి.
కియారా అద్వానీ.. తన అందంతో పాటు నటనతోనూ సినీ ప్రేక్షకులని ఫిదా చేస్తున్న బాలీవుడ్ నటి. ఈరోజు జూలై 31న కియారా తన 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కియారా అద్వానీ జీవితానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకోండి.
2/ 10
కియారా అద్వానీ 1992 జులై 31న ముంబైలో జన్మించింది. అయితే ఆమె అసలు పేరు అలియా అద్వానీ. ప్రస్తుతం సినీ రంగంలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో కియారా ఒకరు. 'ఫగ్లీ' (2014)అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ.
3/ 10
'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రంలో సాక్షి సింగ్ ధోనీ పాత్రను పోషించడం ద్వారా కియారా బాగా ఫేమస్ అయింది.
4/ 10
కియారా 'షేర్ షా', 'కబీర్ సింగ్', 'గుడ్ న్యూస్' వంటి చిత్రాలలో నటించింది. 'జగ్ జుయ్ జియో', 'భూల్ భూలయ్యా 2'తో ఆమె పాపులారిటీ పెరిగింది.
5/ 10
కియారా ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్లో చదువుకుంది. జై హింద్ కళాశాలలో మాస్ కమ్యూనికేషన్‌ను అభ్యసించింది.
6/ 10
వర్క్ ఎక్స్ పీరియన్స్ పొందడానికి, కియారా తన అమ్మమ్మ సలహా మేరకు బోధించడం ప్రారంభించింది. కియారాకు పిల్లలకు బోధించడం చాలా ఇష్టం. ఆమె ముంబైలోని కొలాబాలోని ఎర్లీ బర్డ్స్ స్కూల్లో బోధించేది, అక్కడ ఆమె తల్లి కూడా బోధించేది.
7/ 10
పాఠశాలలో తన నటనా సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి, మెరుగుపరచుకోవడానికి తనకు అవకాశం వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో కియారా తెలిపింది. తాను విద్యార్థుల కోసం పాడటం, నృత్యం చేసేదానినని, వారు తన ప్రదర్శనను నిజంగా ఇష్టపడ్డేవారని చెప్పింది.
8/ 10
కియారా సినిమా రంగంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, సల్మాన్ ఖాన్ సలహా మేరకు ఆమె తన పేరును కియారాగా మార్చుకుంది.
9/ 10
కియారా సినిమాల్లో పాపులారిటీ తర్వాత OTT వైపు మళ్లింది, 'లస్ట్ స్టోరీస్'లో కూడా కనిపించింది. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. మహేష్ బాబు,రామ్ చరణ్ లాంటి టాలీవుడ్ అగ్ర హీరోల సరసన కూడా నటించింది.
10/ 10
కియారా, బాలీవుడ్ నలుడు సిద్దార్థ్ మల్హోత్ర డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.