ఇప్పటికే బన్నీకి చెప్పిన లైన్ బాగుందని.. దాంతో పూర్తి కథను సిద్ధం చేయాలని ప్రశాంత్కు బన్నీ వర్గం చెప్పినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కూడా వర్కవుట్ అయితే తెలుగులో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో ఒకే సీజన్లో సినిమాలు చేసిన దర్శకుడిగా కొత్త చరిత్రకు నాందీ పలుకుతాడు ప్రశాంత్ నీల్. పైగా ఈయన నాన్ తెలుగు దర్శకుడు కావడం గమనార్హం.