యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. అంతేకాదు నార్త్‌లో హిందీ సినిమాల రికార్డులను తిరగరాసింది. బాలీవుడ్లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. మే 27న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. (Twitter/Photos)
కేజీఎఫ్ 2 మూవీ కూడా ఓ పది రోజుల పాటు పే ఫర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ కూడా ఓ పది రోజుల పాటు పే ఫర్ వ్యూ పద్ధతిలో జీ 5లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే ఒక్కసారి చూడాలంటే రూ. 50 పే చేయాలి. అదే రూట్లో కేజీఎఫ్ 2 మూవీని కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. (Twitter/Photo)
ఇక ఈ మూవీ హిందీలో కూడా ఆల్ టైమ్ ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది.మొదటి నాలుగు రోజులు హాలీ డేస్‌ను కేజీఎఫ్ 2 మంచి వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి రూ. 78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి రూ. 83.74 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. (Photo : Twitter)
తెలుగులో రూ. 4.74 కోట్ల లాభాల్లోకి వచ్చింది. కెజియఫ్ వారాల్లో వరల్డ్ వైడ్‌గా 32వ రోజు రూ. 587.54 కోట్ల షేర్ (రూ. 1200.15 కోట్ల గ్రాస్)ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల రేంజ్లో బిజినెస్ చేయగా.. రూ. 240.54 కోట్ల లాభాలను రాబట్టింది. కానీ ఏపీలో మాత్రం ఒక్క ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి కాకపోవడం విశేషం.. (Twitter/Photo)
కేజీఎప్ 2 సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత అంటే మే 27న అమెజాన్ ప్రైమ్‌లో అన్ని భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ కానుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాను అమెజాన్ ప్రైమ్ రూ. 70 కోట్ల రేటుకు దక్కించుకుంది. అంతేకాదు ఓటీటీలో కేజీఎఫ్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే రీతిలో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీ వేదికగా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంది. (Twitter/Photo)
మొత్తంగా హిందీలో మాత్రం అంచనాలకు మించి వసూళ్లను రావడమే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 రూ. 345 కోట్ల రేంజ్లో బిజినెస్ చేయగా.. రూ. 240.54 కోట్ల లాభాలను రాబట్టింది. ఈ యేడాది ఆర్ఆర్ఆర్ సాధ్యంకానీ రూ. 1200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడం మామలు విషయం కాదంటున్నారు ట్రేడ్ పండితులు. (KGF Chapter 2 First Day Collections Photo : Twitter)