యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా మొత్తం భారతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో ఆరో వారంలో కూడా ఇరగదీస్తోంది. (Twitter/Photo)
ఇక ఈ మూవీ హిందీలో కూడా ఆల్ టైమ్ ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది.మొదటి నాలుగు రోజులు హాలీ డేస్‌ను కేజీఎఫ్ 2 మంచి వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి రూ. 78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి రూ. 83.88 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
కేజిఎఫ్ 2 హిందీ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం రూ. 268.63 కోట్లు వసూళ్లు చేసి చరిత్ర సృష్టించింది. 2వ వారం రూ. 80 కోట్లు. గ్రాస్ 3వ వారం రూ. 49.14 కోట్లు గ్రాస్ 4వ వారం రూ. 22.75 కోట్లు గ్రాస్ 5వ వారం రూ. 10.25 కోట్లు గ్రాస్ ఓవరాల్‌గా 5 వారాల్లో 35 రోజుల్లో ఈ సినిమా హిందీలో రూ. 430.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఈ యేడాది బాలీవుడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్‌లో ఉంది. ఓవరాల్‌గా హిందీ సినిమాల్లో బాహుబలి 2 తర్వాత రెండో స్థానం ఉంది. యశ్, ప్రశాంత్ నీల్ల కేజీఎఫ్ 2 ఇపుడు బాలీవుడ్ ట్రేడ్ పండితులును సైతం ఆశ్యర్యపోయే వసూళ్లను రాబడుతోంది. మొత్తంగా హిందీలో అత్యధిక వసూళ్లను సాధించిన సౌత్ సినిమాల విషయానికొస్తే.. (TWitter/Photo)
1. బాహుబలి 2:ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 సినిమా 2017లోనే మొదటి రోజు 40 కోట్ల ఓపెనింగ్ తీసుకొచ్చింది. అప్పటి వరకు బాలీవుడ్లో హైయ్యస్ట్ ఓపెనింగ్ డే నెట్ ఇది. ముందు నుంచి ఉన్న అంచనాల ప్రకారం బాహుబలి 2 రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 510 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. షౌత్ డబ్బింగ్ చిత్రాల్లో టాప్‌లో నిలిచింది. (Twitter/Photo)
3. ఈ సినిమా మొదటి వారం.. రూ. 133.07 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించింది. రెండో వారం ఈ సినిమా రూ. 76.25 కోట్లు నెట్ కలెక్షన్స్ మూడో వారం ఈ సినిమా రూ. 23.50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా ఈ సినిమా రూ. 267.67 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సౌత్ డబ్బింగ్ సినిమాల్లో మూడో స్థానంలో ఉంది. (Twitter/Photo)
7. పుష్ప: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా మొదటి రోజు తక్కువగానే వసూలు చేసింది కానీ తర్వాత పుంజుకుంది. తొలిరోజు ఈ చిత్రానికి అక్కడ 3.31 కోట్లు వచ్చాయి. ఈ సినిమా ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర రూ. 108.61 కోట్ల వసూళ్లను సాధించింది. అంతేకాదు సౌత్ హిందీ డబ్బింగ్ చిత్రాల్లో 7వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
9..కబాలి : రజినీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కబాలి’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్లు.. గ్రాస్ వసూళ్లను సాధించిన సౌత్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో 9వ స్థానంలో నిలిచింది. మరోవైపు హిందీలో ఈ సినిమా రూ. 28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో 8వ స్థానంలో నిలిచింది. (File/Photo)
11. రోబో | శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన మూవీ రోబో. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లోనే రూ. 288 కోట్లు వసూళు చేసింది. ఈ సినిమా సౌత్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో 10వ స్థానంలో నిలిచింది. మరోవైపు హిందీలో ఈ సినిమా అప్పట్లో రూ. 22 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 10లో నిలిచింది. (Twitter/Photo)