2022 భారతీయ చిత్ర పరిశ్రమకు కలిసొచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు, కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 బాలీవుడ్లో సత్తా చాటాయి. ఇక కేజీఎఫ్ తాజాగా 2 వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. కేజీఎఫ్ 2 బాలీవుడ్ సహా పలు ఏరియాల్లో బాహుబలి 2 సహా ఆర్ఆర్ఆర్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. (Twitter/Photo)
RRR మూవీ ఓవరాల్గా రెండు వారాల్లో రూ. 535.21 కోట్ల షేర్ (రూ. 967 కోట్ల గ్రాస్) వసూళ్లతో 2022లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది. కేజీఎఫ్ 2 విషయానికొస్తే.. రెండు వారాల్లో 473.16 కోట్ల షేర్ (రూ. 957.65 కోట్ల గ్రాస్ ) సాధించింది. ఓవరాల్గా ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్స్ దాటక పోయినా.. హిందీలో మాత్రం ఆర్ఆర్ఆర్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ను దాటి పోయింది. (Twitter/Photo)