ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ సినిమాకు కొనసాగింపుగా రెండో పార్ట్‌గా తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 అంతకు మించి సక్సెస్ సాధించింది. ఇప్పటికే ఈ సినిమా ఆర్ఆర్ఆర్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించింది. ఈ సినిమా ఈ యేడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (KGF Chapter 2 Photo : Twitter)
మొత్తంగా భారతీయ బాక్సాఫీస్ దగ్గర దక్షిణ భారత దేశపు సినిమాలు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సంచలనం రేపాయి. హిందీలో ఆర్ఆర్ఆర్ రూ. 260 కోట్ల దగ్గర ఆగిపోతే.. కేజీఎప్ 2 మాత్రం అక్కడ రూ. 400 కోట్లను క్రాస్ చేసి ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతూనే ఉంది. మొత్తంగా 26వ రోజు రూ. 4.60 కోట్లు (రూ. 10.55 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. (File/Photos)
ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ కేజీఎఫ్ స్టార్ యశ్ మాత్రం బాలీవుడ్, టాలీవుడ్ అనే బయట ఏరియాలో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నారు. కానీ సొంత ఇలాకాలో మాత్రం కేజీఎఫ్ 2 మాత్రం కాస్త వెనబడినా ఓవరాల్‌గా ఈసినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. కేజీఎఫ్ 2 ఈ రేంజ్ సక్సెస్ వెనక నార్త్ ఆడియన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 2022లో బీటౌన్‌లో ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు కర్ణాటకలో ఎక్కువ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
రీసెంట్గా కేజీఎఫ్ 2 ఆమీర్ ఖాన్ ‘దంగల్’ లైఫ్ టైమ్ ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను దాటి సంచలనం రేపింది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ 2 బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అది కూడా తెలంగాణలో మాత్రం అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడితే.. ఏపీలో ఒక్కంటే ఒక్క ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేదు. ఓవరాల్‌గా ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ చిత్రాల్లో ఎక్కువ వసూళ్లను సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు రూ. 83.08 కోట్ల షేర్ రాబట్టింది. (Twitter/Photo)
ఓవరాల్‌గా ‘కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ హిట్ ఈ సినిమాకు ఎక్కడో తీసుకెళ్లి పెట్టిందనే చెప్పాలి. సినిమా రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి రూ. 78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొత్తంగా ఈ సినిమా రూ. 83 కోట్లకు (రూ. 134.65 కోట్ల గ్రాస్ ) రాబట్టింది. కెజియఫ్ 3 వారాల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 607.86 కోట్ల షేర్ (రూ. 1162.05 కోట్ల గ్రాస్)ను వసూలు చేసి ఆర్ఆర్ఆర్ లైఫ్ టైమ్ గ్రాస్ వసూళ్లను సాధించింది. (Twitter/Photos)
ఇక ఆర్ఆర్ఆర్ మూవీని వాల్డ్ వైడ్‌గా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 154.86 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. అదే కేజీఎప్ 2 విషయానికొస్తే.. రూ. 347 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా మూడు వారాల్లో రూ. 224.13 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ కంటే కేజీఎప్ 2 నిర్మాతలకు బయ్యర్స్‌కు ఎక్కువ లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్‌గా కలెక్షన్స్ విషయంలో కానీ లాభాల విషయంలో కేజీఎఫ్ .. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఆర్ఆర్ఆర్ను క్రాస్ చేయడం విశేషం.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొట్టి టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. కానీ ఓవరాల్‌గా మాత్రం కేజీఎఫ్ 2 ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ లాభాలను తీసుకొచ్చింది. ఏమైనా చూసుకుంటే.. ఆర్ఆర్ఆర్ పై కేజీఎఫ్ 2 పై చేయి సాధించిందనే చెప్పాలి. మొత్తంగా రాజమౌళిలో ప్రశాంత్ నీల్ ఒక మెట్టు పైనే నిలిచాడని అందరు చెప్పుకుంటున్నారు. (Twitter/Photo)
RRR నిన్నటితో 46 రోజులు పూర్తి చేసుకుంది. 7వ వారంలో ఈ సినిమా నైజాంలో 65 రాయలసీమ (సీడెడ్)లో 90 పైగా ఆంధ్రప్రదేశ్‌లో 90 పైగా స్క్రీన్స్‌లో ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా ఓవరాల్‌గా 190 పైగా స్క్రీన్స్‌లో ప్రదర్శించబడుతోంది. 1st Week - 1400~ 2nd Week - 1000~ 3rd Week - 680~ 4th week - 380+ 5th week - 350+ 6th week - 200+