KGF 2 STREAMING WITH OUT EXTRA CHARGES TODAY ONWARDS SB
KGF 2: అభిమానులకు గుడ్ న్యూస్.. ఇవాల్టి నుంచి ఫ్రీగా కేజీఎఫ్2 స్ట్రీమింగ్
కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. రికార్డుల మీద రికార్డులను నమోదు చేస్తోంది. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన కేజీఎఫ్ 2 సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల జాబితాలో చేరింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా చూసేందుకు ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకున్న అమేజాన్ ప్రైమ్.. ఇవాల్టి నుంచి ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఈ సినిమా చూడటానికి అవకాశం కల్పిస్తుంది.
దక్షిణాదిలోని భాషలో పాటు బాలీవుడ్‌లోనూ విడుదలై.. అన్ని చోట్లా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమానే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీకి అన్ని భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
2/ 10
విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టింది. ఫలితంగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్‌ను అందుకుంది. ఈ ఉత్సాహంతోనే చిత్ర యూనిట్ దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీని తీశారు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
3/ 10
'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీకి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరూ ఎదురు చూస్తున్నట్లు ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలైంది.
4/ 10
కేజీఎఫ్2 స్ట్రీమింగ్ హక్కులను ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
5/ 10
అయితే కేజీఎఫ్2లో ఓటీటీ చూసేందుకు ఎక్స్ట్రా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని చూడాలంటే మాత్రం రూ. 199 తో ఎర్లీ యాక్సెస్ సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రూ. 199 చెల్లిస్తేనే ప్రస్తుతానికి చూడడం వీలు పడుతుంది.
6/ 10
అయితే రీఛార్జ్ చేసుకున్నా... ఒక్కసారి సినిమా చూడడం ప్రారంభిస్తే మాత్రం 48 గంటల్లోనే దాన్ని ముగించాలి. లేదంటే ఆటోమేటిక్‌గా ఆఫర్ క్లోజ్ అయిపోతుంది. దీంతో చాలా మంది అభిమానులు మండిపడ్డారు.
7/ 10
అయితే ఇప్పుడు మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను ఫ్రీగా చూడొచ్చు. ఇవాల్టి నుంచి ఎలాంటి ఛార్జెస్ లేకుండానే కేజీఎఫ్ చూసేయవచ్చు. ఎలాంటి ఎక్స్ ట్రా డబ్బులు చెల్లించుకుండానే.. ఇకపై కేజీఎఫ్ సినిమా చూడొచ్చు.
8/ 10
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటించారు.
9/ 10
శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్గా చేసింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించాడు. సీనియర్ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కీలక పాత్రను పోషించింది.
10/ 10
అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ప్రశాంత్ నిల్ తెరకెక్కించిన వెయ్యి కోట్లకు పైగానే వసూళ్లను దక్కించుకుంది. ఇండియన్ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమాగా.. ఎన్నో అరుదైన రికార్డులను కేజీఎఫ్ 2 దక్కించుకుంది