Ketika Sharma : కొంత మంది హీరోయిన్స్‌కు ఎన్ని సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు ఉండదు. కానీ కొంత మందికి మాత్రం ఫస్ట్ మూవీతోనే కేక పుట్టిస్తారు. అలాంటి హీరోయిన్స్‌లలో కేతిక శర్మ ఒకరు. తాాజాగా ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది. (Instagram/Photo/KetikaSharma)
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్. ఉప్పెన తర్వాత ఆయన నటించిన సినిమా కొండపొలం (Kondapolam). ఈ చిత్రం 2021 అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించింది. Photo: Instagram.com/ketikasharm
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో (Kondapolam on Amazon Prime) స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే వైష్ణవ్ మూడో సినిమా రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga )..ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి తొలి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు వైష్ణవ్ తేజ్ కెరీర్లో చేసిన టోటల్ మూడు సినిమాల్లో ఈ సినిమానే వీక్ ఓపెనింగ్స్ ని అందుకుంది. Photo: Instagram.com/ketikasharm
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో (Kondapolam on Amazon Prime) స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే వైష్ణవ్ మూడో సినిమా రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga )..ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి తొలి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు వైష్ణవ్ తేజ్ కెరీర్లో చేసిన టోటల్ మూడు సినిమాల్లో ఈ సినిమానే వీక్ ఓపెనింగ్స్ ని అందుకుంది. Photo: Instagram.com/ketikasharm
ఇక ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 2, 2022న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానుంది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు వచ్చే నెల నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఎంజాయ్ చేయోచ్చు.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, సుబ్బరాజు, నరేష్, ప్రభు తదితరులు నటించారు. Photo: Instagram.com/ketikasharm
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను మొదట జూలై 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు టీమ్ అయితే.. ఏవో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు గిరీశయ్య దర్శకుడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహించారు. Photo: Instagram.com/ketikasharm
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతోంది. రొమాంటిక్.. సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది. ఆకాష్ పూరి, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించింది. Photo: Instagram.com/ketikasharm
కేతిక శర్మ విషయానికొస్తే.. 24 డిసెంబర్ 1995లో న్యూ ఢిల్లీలో జన్మించింది. ఈమె మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో ఈమె పాపులర్ అయింది. కేతిక శర్మ ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. రంగరంగ వైభవంగా ఫ్లాప్ తర్వాత తన నెక్ట్ప్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి వ్యవహారించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. (Instagram/Photo)