Home » photogallery » movies »

KERALA BEAUTY AIMA ROSMY CUTE PHOTOS NK

Pics : తెలుగు తెరపైకి మరో అందాల కేరళ కుట్టి

Aima Rosmy : అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు మన టాలీవుడ్... వాళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొచ్చి తెలుగు తెరపై పరిచయం చేస్తుంది. అందం, అభినయం కలగలిపిన కేరళ బ్యూటీ ఐమా సెబాస్టియన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ బ్యూటీ నటించిన పడయోత్తం... మళయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వడంతో... ఆమెకు స్టార్ డమ్ వచ్చేసింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ రెండింటిలోనూ ఐమా అదరగొట్టింది. ఆ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తు్న్నారు. ఆమె టాలెంట్ గుర్తించిన తెలుగు యూనిట్... తెలుగులో కూడా హీరోయిన్‌గా తీసుకున్నారు. తెలుగులో సుమంత్ హీరోగా నటిస్తున్నాడు. వినూ యజ్ఞ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా ఐమా అందాల ప్రపంచంలో ఓసారి విహరిద్దాం.