తెలంగాణ లోని గోదావరిఖని సమీపంలో ఉన్న సింగరేణి ప్రాంతానికి చెందిన ఫిక్షనల్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ దసరా మూవీ రిలీజ్ కానుండటం విశేషం. ఈ మూవీ విడుదల కోసం నాని ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
దసరా మూవీలో నాని సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన దసరా ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. ఈ సినిమాలో మాస్ యాక్షన్ రోల్ లో నాని కనిపించనుండటం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. రా అండ్ రగ్గ్డ్ లుక్ లో నాని కనిపించబోతున్నారు.