భారీ అంచనాల నడుమ వచ్చేసిన ఈ సినిమా అన్ని చోట్లా అద్బుతమైన వసూళ్లను అందుకుంటూ అదరగొడుతోంది. సినిమా నాని కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. అంతేకాదు ఓవర్సీస్ ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా టూ మిలియన్ డాలర్స్‌ను అందుకుని నాని కెరీర్లో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. అది అలా ఉంటే కీర్తి సురేష్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. Photo : Instagram
తన సోదరి థాంక్యూ అనే షార్ట్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు దీనికి సంబంధించన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా పంచుకుంది కీర్తి సురేష్. ఆమె తన పోస్ట్‌లో రాస్తూ.. నా సోదరి దర్శకురాలిగా ఎట్టకేలకు అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది. రేవతి నీకు లవ్ ఇంకా హగ్స్ పంపుతున్నాను అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కీర్తి ఫ్యాన్స్ తన సోదరికి ఆల్ దిబెస్ట్ చెబుతూ.. ఇదేం ట్విస్ట్.. అని అంటున్నారు.. మరికొందరు మాత్రం కీర్తి లాగే మీరు కూడా మంచి విజయాన్ని అందుకోవాలనీ కామెంట్స్ చేస్తున్నారు. Photo : Instagram
ఇక దసరా సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఇటీవల ఓటీటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదలైంది. ఏప్రిల్ 27 నుంచి ఈ సినిమా డిజిటల్లో స్ట్రీమింగ్కు వచ్చింది. Photo : Twitter
ఇక ఈ సినిమాలో ఇంటర్నెల్ బ్లాక్ కేక పెట్టించిదని.. ఇంత వరకు తెలుగులో అలాంటీ ఎపిసోడ్ చూడలేదని అంటున్నారు ప్రేక్షకులు. క్లైమాక్స్ కేక ఉందని.. కొద్దిగా ల్యాగ్ ఉందని అని కూడా అంటున్నారు. గోదావరి ఖని సమీపంలో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ రా అండ్ రస్టిక్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందని అంటున్నారు. Photo : Instagram
ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది బోర్డ్. దసరా సినిమా 2 గం. 36 ని. ల నిడివి. ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటించారు. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించింది. తెలంగాణ సింగరేణి నేపథ్యంలో భారీగా వచ్చింది. నాని మాస్ సీన్స్‌కు తోడు పలు కీలక సన్నివేశాల్లో కీర్తి సురేష్ యాక్టింగ్ ఆడియన్స్ హృదయాలు తాకుతుందని అని అంటున్నారు నెటిజన్స్. . Photo : Twitter
అది అలా ఉంటే.. కీర్తి సురేష్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది అలా ఉంటే కీర్తి సురేష్ ఆస్తులు, రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఆమె నికర ఆస్తుల విలువ రూ.22 కోట్లు వరకు ఉంటుందని టాక్. ఇక ఆమె ఒక్కో సినిమాకు ఫీజు 2.5 నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సెలెబ్రిటీల ఆస్తుల గురించి రాసే ఓ వెబ్ సైట్ ప్రకారం ఆమె సంవత్సరానికి 4 నుంచి 6 కోట్ల రేంజ్లో సంపాదిస్తుందని తెలుస్తోంది.. Photo : Instagram
ఇక మరోవైపు కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలుగా హీరోయిన్ల పెళ్లిపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. అందులో భాగంగా తాజాగా మలయాళీ అందం కీర్తీ సురేష్ పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. Photo : Instagram
కీర్తి.. తల్లిదండ్రులు నిశ్చయించిన వరుడితో ఏడు అడుగులు వేయటానికి ఓకే చెప్పారట. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఇక పెళ్లికొడుకు విషయానికి వస్తే.. కీర్తిని చేసుకుబోయేవాడు మంచి వ్యాపారవేత్త అని.. అంతేకాదు తమిళ రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారట. అయితే వరుడి విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఇది తెలుసుకున్న నెటిజన్స్, కీర్తి ఫ్యాన్స్ మాత్రం కాస్తా అప్ సెట్లో ఉన్నారట. అప్పుడే కీర్తికి పెళ్లి ఏంటనీ పరేషాన్ అవుతున్నారట. Photo : Instagram
ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేష్, టొవినో థామస్ నటించిన లేటెస్ట్ చిత్రం వాసి. మలయాళంలో వచ్చిన ఈ సినిమా జూన్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. విడుదలైన నెలరోజులకు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 17 నుంచి తెలుగు, తమిళ, మలయాళీ భాషాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి విష్ణు రాఘవ్ దర్శకుడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇద్దరు ప్రతిభావంతులైన న్యాయవాదుల మధ్య సాగే కోర్టు రూమ్ డ్రామా.. Photo : Twitter
ఆ సినిమాతో పాటు.. కీర్తి సురేష్ నటించిన మరో సినిమా సర్కారు వారి పాట.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ 2022 మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. Photo : Instagram
కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో కూడా నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. Photo: Instagram
హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. Photo: Instagram
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సరోగసీ అనే పద్దతి ద్వారా ఓ పిల్లలు లేని ఓ విదేశీ జంటకు బిడ్డను కని ఇవ్వడం అనేది కాన్సెప్ట్.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’. చూడాలి మరి తెలుగు తమిళ భాషాల్లో ఎలా ఆకట్టుకోనుందో.. ఇక కీర్తి (Keerthy Suresh good luck sakhi)నటించిన మరో సినిమా గుడ్ లక్ సఖీ.. ఈ సినిమా జనవరి 28 2021న విడుదల అయ్యింది. Photo: Instagram