టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా సక్సెస్‌తో కీర్తి సురేష్ ఫుల్లు ఖుషీలో ఉంది. Photo : Twitter
ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చివరగా విడుదలైన మాస్ సాంగ్, మ..మ.. మహేశాకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ స్టెప్స్‌తో తెగ వైరల్ అవుతోంది. కలర్ ఫుల్ కాస్టూమ్స్‌తో అదరగొట్టే స్టెప్స్‌తో వావ్ అనిపించారు మహేష్ బాబు, కీర్తి సురేష్. Photo : Twitter
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచికళావతి (Kalaavathi song)అనే సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి కేక పెట్టిస్తోంది.
Keerthy Suresh : కీర్తి సురేష్.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)తో అభిమానులను పలకరించింది. Photo : Instagram
పరశురామ్ పెట్లా దర్శకుడు.. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. Photo: Instagram
హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. Photo: Instagram
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సరోగసీ అనే పద్దతి ద్వారా ఓ పిల్లలు లేని ఓ విదేశీ జంటకు బిడ్డను కని ఇవ్వడం అనేది కాన్సెప్ట్.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’. చూడాలి మరి తెలుగు తమిళ భాషాల్లో ఎలా ఆకట్టుకోనుందో.. ఇక కీర్తి (Keerthy Suresh good luck sakhi)నటించిన మరో సినిమా గుడ్ లక్ సఖీ.. ఈ సినిమా జనవరి 28న అయ్యింది. Photo: Instagram