తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న నటి మహానటి 'సావిత్రి'. ఆమె జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బయోపిక్ ‘మహానటి’. ఈ సినిమా కోసం కీర్తి సురేష్‌ను సావిత్రి పాత్రలో చూపిస్తూ... సావిత్రి వాస్తవ జీవితంలో కీలక ఘట్టాలను తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. తెలుగు తెరను రెండు దశాబ్దాలుగా ఏలిన సావిత్రి జీవితంపై తెరకెక్కిన ‘మహానటి’ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చనిపోయిన 40 ఏళ్ల తర్వాత కూడా వెండితెరపై ‘మహానటి’ మూవీతో జనాల్లో సావిత్రి పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదని ఈ మూవీ సక్సెస్ మరోసారి ప్రూవ్ చేసింది. Photo : Twitter
ముఖ్యంగా మహానటిగా సావిత్రిగల క్రేజ్...ఆమె జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి.. మహానటిగా కీర్తి సురేష్ అద్భుత నటన. యూత్‌లో క్రేజ్ వున్న నటీనటులు ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషించడం..అలాగే సీనియర్ నటీనటుల నటన...వైజయంతి మూవీస్ నిర్మాణ విలువలు..దర్శకుడిగా నాగ్ అశ్విన్ టేకింగ్ ఇలా అన్ని అంశాలు ‘మహానటి’ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. Photo : Twitter
66వ జాతీయ అవార్డుల్లో సావిత్రి జీవిత కథపై నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ సత్తా చాటింది. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ తెలుగు చలన చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ నటి.. ఉత్తమ కాస్ట్యూమ్స్ విభాగాల్లో అవార్డు గెలుచుకుంది. ముఖ్యంగా కీర్తి సురేష్..మహానటి సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందా అనే రేంజ్లో నటించి మెప్పించింది. ఒకవైపు ‘మహానటి’ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ భాష చలనచిత్రం అవార్డుతో పాటు ఉత్తమనటి అవార్డు రావడం విశేషం. Photo : Twitter
తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ పురస్కారం దక్కింది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన 'మహానటి'లో కీర్తి సురేష్ నటనకు ఈ పురస్కారం లభించింది. ఇంతకు ముందు ఈ అవార్డ్ 1990లలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ‘కర్తవ్యం’ చిత్రంలో తన నటనకు ఈ అవార్డు దక్కింది. ఇన్నేళ్ల తర్వాత తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్ కు పురస్కారం దక్కడం విశేషం. Photo : Twitter