Keerthy Suresh: కీర్తి సురేశ్‌కు కొత్త పరీక్ష.. అన్నీ ఒకేసారి..

కీర్తి సురేశ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ కాగా.. మరో మూడు సినిమాలు షూటింగ్ ‌కోసం వెయిట్ చేస్తున్నాయి. అయితే కీర్తి నటించడానికి కమిటైన మరో సినిమా షూటింగ్ కూడా మొదలైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే సినిమా షూటింగ్ కరోనా జాగ్రత్తల నడుమ మళ్లీ ప్రారంభించారు. దీంతో ఈ సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేయడం కీర్తికి అంత తేలిక కాదనే టాక్ వినిపిస్తోంది.