Home » photogallery » movies » KEERTHY SURESH HOT BACKLESS PHOTOS GOES VIRAL IN SOCIAL MEDIA WITH SRIDEVI DAUGHTER JANHVI KAPOOR CR

కీర్తి సురేష్ హాట్ యాంగిల్... జాన్వీ కపూర్‌తో కలిసి బ్యాక్‌లెస్ ఫోటోల్లో ‘మహానటి’...

హీరోయిన్ కీర్తి సురేష్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘నేను శైలజ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, ఆ తర్వాత ‘నేను లోకల్’, ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాల్లో కనిపించినా... ‘మహానటి’ సినిమా కీర్తి సురేష్‌లో అసలు సిసలు నటిని తెలుగువారికి పరిచయం చేసింది. మహానటి సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన కీర్తి సురేష్... తన నటనతో విమర్శకులను కూడా మెప్పించింది. కోలీవుడ్‌లో కూడా సూర్య, విక్రమ్, విశాల్, విజయ్ వంటి స్టార్స్ సరసన నటించిన కీర్తి సురేష్... అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే ఎక్కడా పెద్దగా గ్లామర్ ఒలికించని ఈ బొద్దు గుమ్మ... తనలోని హాట్ యాంగిల్ చూపిస్తూ గ్లామర్ ప్రియుల మతులు పొగొడుతోంది.