Home » photogallery » movies »

KEERTHY SURESH BECOMES SUPER SLIM AND LOOKS HOT IN HER LATEST PHOTO SHOOT SR

సూపర్ స్లిమ్‌గా కీర్తి సురేష్.. హాట్ లుక్స్‌తో అదరగొడుతోన్న మహానటి

కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. అయితే ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. చాలా రోజుల తర్వాత కీర్తి సురేష్, నాగార్జున హీరోగా వస్తున్న 'మన్మథుడు 2'లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అంతేకాకుండా కీర్తి ప్రస్తుతం ఓ హిందీ సినిమా చేస్తోంది. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్ సరసన నటించనుంది. అందులో భాగంగా కీర్తి ఈ సినిమా కోసం పూర్తిగా మారిపోయింది. సన్నగా మారీ ఓ ఫోటోషూట్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.