మహానటి సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు స్వీకరించిన కీర్తి సురేష్..

66వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీతోని విజ్జాన్ భవన్‌లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ కాటగిరీల్లో ఎంపికైన వారికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అవార్డులను అంద చేశారు. మహానటి చిత్రానికి గాను ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అవార్డు అందుకున్నారు. మరోవైపు అందాధున్, ఉరి.. ది సర్జికల్ స్ట్రైక్ సినిమాల్లో నటనకు గాను ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ ఉత్తమ నటులుగా అవార్డు అందుకున్నారు. ఇక ‘చి..ల..సౌ..’ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును రాహుల్ రవీంద్రన్ అందుకున్నారు. ఇక ఉత్తమ సామాజిక చిత్రం విభాగంలో ‘పాడ్‌మాన్’ చిత్రంలోని నటకు అక్షయ్ కుమార్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు.